ఓ మంత్రగాడు బరి తెగించాడు. భర్త అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని వివాహితకు లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు. దీనికి సదరు భర్త కూడా వత్తాసు పలకడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది.
మధిర : ‘అరిష్టం పోయి.. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావాలంటే 45 రోజులు మీ ఇంట్లో Occult worship చేయాలి. పూజలు జరిగినన్ని రోజులు నీ భార్య నాతో physical relationship పెట్టుకోవాలి. నేను చెప్పినట్టు చేస్తేనే పూజ ఫలిస్తుంది. మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అంటూ ఇంటి యజమానిని Superstition మాయలో పడేశాడు ఓ మాంత్రికుడు. అతడి మాటలు నమ్మిన సదరు వ్యక్తి.. చెప్పినట్లు చేయాలని భార్యను ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన ఇంటికి అరిష్టం పట్టిందని క్షుద్ర పూజలు చేసే ఏపీ లోని కృష్ణాజిల్లా వదినేపల్లికి చెందిన శ్రీనివాస్ ను ఆశ్రయించాడు. దీంతో అరిష్టాన్ని తొలగిస్తాం అని నమ్మబలికిన శ్రీనివాస్.. ఐదు రోజుల క్రితం మధిరకు వచ్చి క్షుద్రపూజలు మొదలుపెట్టాడు. సదరు వ్యక్తి భార్య 45 రోజులు తనతో శారీరకంగా కలవాలని, తాను చెప్పినట్లు చేయాలని, తాను తాగమన్నదే తాగాలని.. అలా చేస్తేనే అరిష్టం తొలగిపోతుందని చెప్పాడు. దాంతో భర్త కూడా శ్రీనివాస్ చెప్పినట్లు చేయాలని భార్యపై ఒత్తిడి చేయడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
శనివారం రాత్రి తల్లిదండ్రులతో వచ్చి మధిర పోలీస్స్టేషన్లో శ్రీనివాస్ తో పాటు తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కాగా, సంవత్సరం క్రితం జిల్లాలోని ఎర్రపాలెం మండలంలోనూ ఇదే తరహాలో క్షుద్ర పూజల పేరుతో ఇంటర్ చదువుతున్న అమ్మాయిని అపహరించుకు పోయిన ఘటన జరిగింది. ఇప్పుడు మధిరలో మళ్లీ క్షుద్రపూజల వ్యవహారం వెలుగుచూసింది.
ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లా దర్శిలో ఓ వ్యక్తి భార్య మీద ఇలాంటి ఘాతుకానికే తెగబడ్డాడు. Electrical wires చుట్టి భార్యా బిడ్డల మీద హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి ఉదంతం ఇది. ఆదివారం రాత్రి Darshiలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సౌ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... పొదిలి మండలంలోని సూదనగుంట రామాపురం గ్రామానికి చెందిన దేవం రమణారెడ్డికి దొనకొండ మండలం నారసింహనాయునిపల్లికి చెందిన కేజియాతో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది.
వీరికి కుమారుడు రేవంత్ (6) ఉన్నాడు. రమణారెడ్డి సినిమా హాలును లీజుకు తీసుకుని నిర్వహిస్తుంటాడు. ప్రస్తుతం దర్శిలోని పొదిలి రోడ్డులో వీరు నివాసం ఉంటున్నారు. భార్య మీద Suspicionతో తరచూ ఆమెను దూషిస్తూ కొట్టేవాడు. ఇటీవల గొడవలు తీవ్రం అయ్యాయి. ఆదివారం రాత్రి ఆమెను రమణారెడ్డి తీవ్రంగా గాయపరిచాడు. కుమారుడి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. అంతేగాక ఇద్దరి శరీరాలకు తీగలు చుట్టి విద్యుదాఘాతం ద్వారా మట్టుబెట్టేందుకు యత్నించాడు.
దీంతో రేవంత్ శరీరం మీద తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి కేకలకు నిద్ర లేచిన ఇంటి యజమాని అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూసి రమణారెడ్డి పరారయ్యాడు. బాధితులకు దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి ఒంగోలు తరలించారు. కెజియా ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
