మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ముఖ్యనాయకులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనే విషయంలో టీఆర్ఎస్ వర్గాల్లో అనిశ్చితి నెలకొంది.
మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ముఖ్యనాయకులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు మంగళవారం మర్రిగూడ జరిగిన రోడ్‌షో పాల్గొన్ని ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు మునుగోడులో ప్రచారం నిర్వహించే అంశంపై పార్టీ శ్రేణుల్లో అనిశ్చితి నెలకొంది.
మునుగోడు ఉప ఎన్ని ప్రచారంపై ప్రణాళిలు రూపొందించిన సమయంలో.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ ప్రచార బాధ్యతలు అప్పజెప్పారు. ఈ క్రమంలోనే మర్రిగూడ మండలానికి మంత్రి హరీశ్ బాధ్యతలు తీసుకున్నారు. మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌గా సీఎం కేసీఆర్ తనను తాను నియమించుకున్నారు. చండూరు మండలం ఘట్టుప్పల్ గ్రామానికి కేటీఆర్‌ను బాధ్యునిగా నియమించారు.
హరీష్ రావు ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించగా.. గత వారం రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న కేసీఆర్ మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై టీఆర్ఎస్ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఆయన హైదరాబాద్‌కు తిరిగి ఎప్పుడూ చేరుకుంటారనే దానిపై సమాచారం లేదని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మరో మూడు రోజులు పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారనే మాట వినిపిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు కూడా రానున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా వంటి నేతలు ప్రచారంలో పాల్గొంటేనే.. కేసీఆర్ కూడా మునుగోడులో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడులో అమిత్ షా లేదా జేపీ నడ్డా ప్రచార షెడ్యూల్‌ను బీజేపీ ఖరారు చేస్తే.. దానికి కౌంటర్‌గా తన బహిరంగ సభ ప్లాన్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. వారి ప్రచారానికి ఒక రోజు ముందుగానీ.. తర్వాత గానీ తన సభ నిర్వహించేలా కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఒకవేళ జేపీ నడ్డా గానీ, అమిత్ షా గానీ.. మునుగోడు ప్రచారానికి రాని పక్షంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బీజేపీ ప్రణాళికలను బట్టి అక్టోబర్ 29 నుంచి నవంబర్ 1 మధ్యలో ఏదో ఒక రోజు కేసీఆర్ మునుగోడులో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందు.. ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలసిందే. ఆ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో చండూరులో మరోసారి సభ నిర్వహిస్తామని చెప్పారు. రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు సీఎం కేసీఆర్.. చండూరులో సభను నిర్వహించలేదు.
కేటీఆర్ విషయానికి వస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కేటీఆర్ మునుగోడుకు వెళ్లలేదు. అయితే మునుగోడు నియోజకవర్గ రైతులు, చేనేత కార్మికులు.. ఇలా పలు వర్గాలతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు.. గతానికి, టీఆర్ఎస్ పాలనకు మధ్య తేడాను గమనించాలని కోరుతున్నారు. అయితే ఆయన మునుగోడులో కేటీఆర్ ఎప్పుడూ ప్రచారంలో పాల్గొంటారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
