మహానటుడిగా వెండితెర వేల్పుగా తెలుగువారి నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్.. రాజకీయంగానూ అంతే ప్రభంజనం సృష్టించారు. సంచలన నిర్ణయాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఆయన తర్వాతో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్టీఆర్ స్ధానం మాత్రం ప్రత్యేకం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నగారి పిలుపుతో రాజకీయాల్లో ప్రవేశించి మూడు దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు.

పరిపాలనలో, సంక్షేమ కార్యక్రమాల్లో కేసీఆర్.. అన్నగారిని ఫాలో అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డును చంద్రశేఖర్ రావు బద్దలుకొట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామారావు 31 రోజుల పాటు మంత్రిమండలి లేకుండా పరిపాలన సాగించారు..

తాజాగా ఆ రికార్డును టీఆర్ఎస్ అధినేత బద్ధలుకొట్టబోతున్నారు. గత నెల 13న రెండవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత... ఆయన ఇంతవరకూ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు.

ఎన్టీఆర్ నెలకొల్పిన 31 రోజుల రికార్డు ఈ నెల 12తో ముగుస్తుంది. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత తన కేబినెట్ విస్తరణ ఉంటుందని చంద్రశేఖర్ రావు సంకేతాలు ఇవ్వడంతో అన్నగారి రికార్డు కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కేసీఆర్ మంత్రి విస్తరణ తేదీ ఇదే: హరీష్ రావుకు నో చాన్స్?

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే హవా: వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడి

కోమటిరెడ్డికి మరో షాక్: నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ

‘మంత్రివర్గ విస్తరణకు.. పంచాయితీ ఎన్నికలు అడ్డుకాదు’