Asianet News TeluguAsianet News Telugu

నేడు హైకోర్టు నూతన సీజే ప్రమాణ స్వీకారం.. రాజ్‌భవన్‌కు వెళ్లనున్న కేసీఆర్..!

రాజ్‌భవన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారరం చేయనున్నారు. సంప్రదాయంగా రాజ్ భవన్ వర్గాలు ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎంవోకు ఆహ్వానం పంపాయి. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే చర్చ సాగుతుంది. 

Will KCR attend attend high court CJ swearing-in ceremony in Raj Bhavan
Author
First Published Jun 28, 2022, 9:18 AM IST

తెలంగాణలో గత కొంతకాలంగా రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య గ్యాప్‌ పెరిగిన సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన పలు వేడుకలను సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. అయితే మంగళవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారరం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సంప్రదాయంగా రాజ్ భవన్ వర్గాలు ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎంవోకు ఆహ్వానం పంపాయి.

అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే చర్చ సాగుతుంది. ఎందుకంటే గత కొంతకలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు కారణం. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం సీఎం కేసీఆర్.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు  మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. 

ఇక, కేసీఆర్ నేడు రాజ్‌భవన్‌కు వెళితే.. చాలా కాలం తర్వాత గవర్నర్ తమిళిసై, కేసీఆర్ ఒకే వేదికపై కనిపించినట్టుగా అవుతుంది. అయితే టీఆర్ఎస్‌లో ఓ వర్గం మాత్రం కేసీఆర్.. రాజ్‌భవన్‌కు వెళ్లకపోవచ్చని చెబుతోంది. ఒకవేళ రాజ్‌భవన్‌లో జరిగే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోతే.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే..  రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం ఐదో ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios