వారి పెళ్లి జరిగి కనీసం  సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య చాలా బాధపడింది. ఆ బంధాన్ని వదులుకోవాలని ప్రాధేయపడింది. అయినా ఆ భర్త కనికరించలేదు. కనీసం తనకైనా  విడాకులు ఇవ్వమని కోరింది. ఆ అభ్యర్థనను కూడా అతను పట్టించుకులేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ... తన బంధువుల  సహాయంతో భర్తను ఉతికి ఆరేసింది. అందరూ చూస్తుండగానే చితకబాదింది. ఈ సంఘటన కూకట్ పల్లిలోని ప్రగతి నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రగతి నగర్ కి చెందని వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. కొద్ది రోజులపాటు భార్యతో ప్రేమగా ఉన్న ఆ వ్యక్తి ఆ తర్వాత నుంచి దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కారణం ఏమిటంటని భార్య ఆరా తీయగా... వివాహేతర సంబంధమని తేలింది. పెళ్లైన కొద్దిరోజులకే భార్యను వదిలేసిన భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విడాకులివ్వమని భార్య కోరినప్పటికీ ఎంతకీ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన భార్య తన బంధువులతో కలిసి వచ్చి భర్తపై దాడి చేసింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.