Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించి, పెళ్లి చేసుకుని మొహం చాటేసిన భర్త.. 42 రోజులు దీక్ష చేసి.. ఆత్మహత్య చేసుకున్న భార్య...

హుజురాబాద్ కు చెందిన సుజిత్ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని (34) తో Onlineలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొద్ది రోజులకు Loveగా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో చెబితే ఇప్పుడే ఒప్పుకోరనో.. లేక ముందుగానే ఆమెను వాడుకుని వదిలేసే ప్లానో కానీ..  2020 నవంబర్ 25న హైదరాబాదులోని ఆర్యసమాజంలో గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. 

wife suicide after 42 days protest in front of husbands house in karimnagar
Author
Hyderabad, First Published Jan 7, 2022, 7:50 AM IST

హుజూరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను మోసం చేశాడని తెలుసుకుని, ఎలాగోలా అతని ఆచూకీ పట్టుకుని పట్టుదలతో 42 రోజులుగా diksha చేసిన ఆ యువతి పోరాటం విఫలం అయ్యింది. భర్త Cheatingతో చివరికి తనువు చాలించిన సంఘటన పలువురిని కలచివేసింది. తనను భార్యగా స్వీకరించాలనే డిమాండ్ తో చేసిన పోరాటం ఆమెను కానరాని లోకాలకు చేర్చి విషాదాంతంగానే ముగిసింది,

వివరాల్లోకి వెళితే హుజురాబాద్ కు చెందిన సుజిత్ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుండగా కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని (34) తో Onlineలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొద్ది రోజులకు Loveగా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో చెబితే ఇప్పుడే ఒప్పుకోరనో.. లేక ముందుగానే ఆమెను వాడుకుని వదిలేసే ప్లానో కానీ..  2020 నవంబర్ 25న హైదరాబాదులోని ఆర్యసమాజంలో గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత ఒకరోజు సుజిత్ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు.

అప్పటికీ సుహాసినికి అనుమానం రాలేదు. ఏం జరిగిందో, భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆమె కంగారు పడింది. అయితే, కొద్ది రోజులకు తనను వదిలేసి వెళ్లిపోయాడని తెలిసింది. కానీ, అతని అడ్రస్, వివరాలు ఏమీ తెలియవు. అప్పుడు కనుక్కోవడం మొదలుపెట్టింది. భర్తపై ఉన్న ప్రేమను చంపుకోలేక.. అతనే కావాలంటూ ఆ యువతి చివరికి అతని ఆచూకీ కనుక్కుంది. ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే.. అతను ఆమెను భార్యగా అంగీకరించడానికి నిరాకరించాడు. ఇంట్లో వాళ్లూ ఒప్పుకోలేదు. దీంతో హుజూరాబాద్ లోని సుజిత్ ఇంటి ముందుర నవంబర్ 26 నుంచి దీక్ష చేస్తుంది. అయినా అత్తింటి వారు ఆదరించలేదు.

పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కోసం పోరాడింది. కొన్ని రోజులు దీక్ష కొనసాగించింది. చివరికి భర్తకు మరో పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని తెలుసుకుని బుధవారం పురుగుల మందు తాగింది. వరంగల్ ఎంజీఎంలో చేర్పించగా గురువారం మృతి చెందిందని పట్టణ సిఐ శ్రీనివాస్ తెలిపారు. అంతకుముందు సూసైడ్ నోట్ రాసింది. త మృతికి భర్త సుజిత్, అత్త పద్మ, కల్యాణి, మామ శ్రీనివాస్ రెడ్డి, మరిది సుహాస్ రెడ్డి కారణం అని పేర్కొంది. 

ఇదిలా ఉండగా, భర్త వేధింపులను తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. ఫలక్ నుమా గుల్షన్ మాస్క్ కు చెందిన సయ్యద్ ఫయాజ్ (32), షాహిదా బేగం భార్యాభర్తలు. మద్యానికి బానిసై భర్త తరచూ వేధించేవాడు.

జీవితంమీద విరక్తి చెందిన భార్య షాహిదా బేగం 2013లో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు భర్త మీద 489ఎ, 306 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శైలజా వాదనలు వినిపించడంతో 7 అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి డి. శ్రీనివాస్ సయ్యద్ ఫయాజ్ కు 9యేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించిందని ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios