తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను నరికేసింది..

wife kills husband
Highlights

తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. భర్తను నరికేసింది.. 

ప్రతి రోజు తాగొచ్చి గొడవ చేస్తున్న భర్త ఆగడాలు మరింత పెచ్చుమీరడంతో .. ఆ ఇల్లాలి సహనం నశించింది. ఆ నరకయాతన భరించలేక భర్తను అంతమొందించింది.  కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం బంధంపల్లి సమీపంలోని గొల్లపల్లికి చెందిన కొక్కుల ఓదెలు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ.. ఐదేళ్ల క్రితం పదవి విరమణ చేశాడు. ఇతనికి తాగుడు అలవాటు ఉండటంతో.. ప్రతీ రోజు ఇంటికి తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు.. దీంతో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరిగేవి.

ఈ నేపథ్యంలో తీవ్రమనస్తాపానికి గురైన భార్య రాజమ్మ ఒక రోజు అర్థరాత్రి దాటిన తరువాత ఇంటి ముందు నిద్రిస్తున్న ఓదెలు తలపై గొడ్డలితో నరికింది. అప్పటికీ చనిపోకపోవడంతో కర్రతో మరోసారి తలపై మోదడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.. భర్త చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత గొడ్డలి, కర్రపై ఉన్న రక్తాన్ని కడిగి దాచిపెట్టి పక్కింటింది. అనంతరం పక్కింటి వారి తలుపులు కొట్టి నలుగురు దొంగలు ఓదెలును చంపారని చెప్పింది.

ఆమె మాటలు విని ఇంట్లోకి వచ్చి చూడగా.. రక్తపు మడుగులో ఓదెలు చనిపోయి ఉన్నాడు.. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు... ఇంట్లో ఉన్న వస్తువులు, నగదు, బంగారం పోయినట్లుగా అనిపించకపోవడంతో పాటు.. రాజమ్మ ప్రవర్తనపై అనుమానం కలగడంతో.. గట్టిగా ప్రశ్నించగా.. భర్త వేధింపులు భరించలేక తానే చంపినట్లు అంగీకరించింది. అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన కర్ర, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
 

loader