Asianet News TeluguAsianet News Telugu

కొడుకు కాపురం చక్కదిద్దబోయి.. భర్తను చంపిన భార్య...

కోడలు పుట్టింటికి వెళ్లి, ఎన్నిసార్లు అడిగినా రావడం లేదు. ఈ విషయం మీద మంగళవారం కల్వకుర్తి పట్టణంలో పంచాయతీ ఉండగా ఈర్యా నాయక్, ద్వాలీ కలిసి వెళ్లాల్సి ఉంది. కాగా, పక్క ఊరికి వెళ్లిన భర్త ఈర్యా నాయక్ సకాలంలో ఇంటికి రాలేదు. దీంతో ఈర్యా నాయక్ రాగానే పంచాయతీకి వెళ్లాల్సి ఉందని భార్య గొడవకు దిగింది. 

wife killed husband over a small dispute in mahbubnagar
Author
Hyderabad, First Published Dec 1, 2021, 8:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉప్పునుంతల : మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది. క్షణికావేశంలో భార్య 
Attack చేయగా భర్త మృతి చెందిన ఘటన Nagar Kurnool జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లత్తీపూర్ గ్రామానకి చెందిన మూడవత్ ఈర్యా నాయక్ (55), ద్వాలీ దంపతులు. వీరి కుమారుడు, కోడలికి కొంతకాలం క్రితం  Conflicts వచ్చాయి. 

దీంతో కోడలు పుట్టింటికి వెళ్లింది. ఎన్నిసార్లు అడిగినా రావడం లేదు. ఈ విషయం మీద మంగళవారం కల్వకుర్తి పట్టణంలో పంచాయతీ ఉండగా ఈర్యా నాయక్, ద్వాలీ కలిసి వెళ్లాల్సి ఉంది. కాగా, పక్క ఊరికి వెళ్లిన భర్త ఈర్యా నాయక్ సకాలంలో ఇంటికి రాలేదు. దీంతో ఈర్యా నాయక్ రాగానే పంచాయతీకి వెళ్లాల్సి ఉందని భార్య గొడవకు దిగింది. 

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగింది. ఆ గొడవతో ద్యాలీ తీవ్ర ఆవేశానికి గురైంది. పక్కనే ఉన్న Stickతో భర్త ఈర్యా నాయక్ headమీద కొట్టగా.. తీవ్రంగా గాయపడిన ఈర్యా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో. అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్సై రమేష్ అజ్మీరా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈర్యా నాయక్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని.. భార్యను ఉరేసి చంపి.. ఫ్యాన్ కు వేలాడదీసిన భర్త..

ఇదిలా ఉండగా, అక్టోబర్ లో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో భర్త మృతికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు మోమిన్ పేట్ సీఐ వెంకటేశం తెలిపారు. మండలానికి చెందిన చిన్నమల్కు శివశంకర్ (30)కు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. సంవత్సరం క్రితం ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. 

ఆ సమయంలో సంగారెడ్డికి చెందిన జహంగీర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా Extramarital affairకి దారి తీసింది. ఇటీవల మళ్లీ ఆమె భర్త దగ్గరకు రావడంతో జహంగీర్ శివశంకర్ తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి Alcohol తాగేవారు. ఇటీవల మళ్లీ శివశంకర్ భార్యను వేధిస్తుండటంతో ప్రియుడు, ఆమె కలిసి అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. మాయమాటలతో జహంగీర్ అతడిని మంగళవారం మైతాప్ ఖాన్ గూడకు తీసుకునివెళ్లి మద్యం తాగించాడు. 

Telangana Airports: తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల స్టేటస్‌ ఇదే.. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం..

తాగిన మైకంలో ఉన్న అతడిపై రాళ్లతో దాడి చేసి Murderకు ప్రయత్నించాడు. తీవ్రగాయాల పాలైన శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios