హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు పవన్ కుమార్ వ్యవహారం రేపుతోంది.
హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు పవన్ కుమార్ వ్యవహారం రేపుతోంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నాలుగో భార్య డిమాండ్ చేస్తోంది.
మ్యాట్రిమోని ద్వారా హిమబిందుకు పవన్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. పెద్దల సమక్షంలో పవన్ , హిమబిందు వివాహం చేసుకున్నారు. అయితే గతంలోనే పవన్ కు మూడు పెళ్లిళ్లు అయినట్లు తెలుసుకున్న హిమబిందు షాకైంది.
సైబర్ క్రైమ్ మహిళా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
