తప్పుచేసిన వారికి న్యాయం చేయాల్సిన ఓ లాయరే కట్టుకున్న భార్యకు మాత్రం అన్యాయం చేశాడు. వేరే మహిళతో సదరు లాయర్ వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు రెండ్ హ్యండెడ్ గా  పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ రామంతాపూర్ లో చోటుచేసుకుంది. 

ఉప్పల్ లో నివాసముంటున్న క్రిమినల్ లాయర్ కృష్ణమాచారి, వింధ్యారాణి భార్యభర్తలు. వింద్యారాణి కొన్నాళ్ళక్రితం వరకు రాజస్ధాన్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. దీంతో ఆమె రాజస్థాన్ లో, భర్త హైదరాబాద్ లో ఒంటరిగా వుండేవారు. ఈ క్రమంలోనే కృష్ణమాచారి వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఏకంగా ఓల్డ్ రామంతాపూర్ లో కాపురమే పెట్టేశాడు.  

అయితే భర్తకు దూరంగా వుండలేక వింధ్యారాణి తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చేశారు. కొద్దిరోజుల నుండి హైదరాబాద్ లోనే వుంటున్న ఆమెకు భర్త ప్రవర్తనపై అనుమానం కలిగి అతడి కదలికలపై నిఘా వుంచింది. దీంతో భర్త వివాహేతర సంబంధం గురించి బయటపడింది. 

దీంతో ఇవాళ భర్త తన ప్రియురాలి ఇంట్లో వున్నట్లు గుర్తించిన వింధ్యారాణి బంధువులు,షీ టీమ్ పోలీసుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కృస్ణమాచారితో పాటు అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.