ఓ వివాహిత దారుణానికి తెగించింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. పనిచేస్తున్న చోటే మృతదేహాన్ని పూడ్చి పెట్టి ఏమీ తెలియనట్టు అత్తవారింటికి వెళ్లింది.
కామారెడ్డి : వివాహితకు ఓ వ్యక్తి తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆ తర్వాత పని చేస్తున్న చోటే గుంత తీసి పూడ్చి పెట్టింది. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా బొద్దెంపల్లికి చెందిన ఎరుకల రమేష్(27)కు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లెకు చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల కిందట వివాహమయ్యింది.
దంపతులు జీవనోపాధికి హైదరాబాద్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఒక ఆడపిల్ల ఉందని స్థానికులు తెలిపారు. ఏడాది క్రితం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గుందాలకు చెందిన దస్తప్పతో వెన్నెలకు పరిచయం ఏర్పడింది. విషయం కొద్ది రోజుల తర్వాత రమేష్ కు తెలిసింది. దీంతో వీరి ముగ్గురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. నెల క్రితం రమేష్ కుటుంబ సభ్యులతో ఎల్లారెడ్డికి వచ్చాడు. గత నెల 30న భర్త హైదరాబాద్ కు వెళ్లడంతో ఆమె ప్రియుడు దస్తప్పను పిలిపించుకుంది. రాత్రి 11 గంటల సమయంలో రమేష్ ఆకస్మాత్తుగా వచ్చాడు. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోయాడు.
కరీంనగర్ : పొలం దున్నుతూ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. రైతు గల్లంతు
వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో దస్తప్ప అందుబాటులో ఉన్న తాడును తీసుకుని రమేష్ మెడకు చుట్టాడు. భార్య రమేష్ కాళ్ళను గట్టిగా పట్టుకుంది. దీంతో తాడు గొంతుకు బిగుసుకుపోయి రమేష్ మరణించాడు. ఆ తర్వాత వారికి శవాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. నిర్మాణంలో ఉన్న భవనం ఆవరణలోనే గుంత తీసి మృతదేహం ఇద్దరూ కలిసి పూడ్చేశారు. తర్వాత ఉదయం ఏమీ తెలియనట్లుగా ఆమె అత్త గారి ఇంటికి వెళ్లిపోయింది.
రమేష్ అన్న వెంకటప్ప భర్త గురించి అడగితే.. ఎటో వెళ్ళిపోయాడు అని చెప్పింది. అయితే ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు అంతకు ముందే తెలిసి ఉండడంతో.. అనుమానం వచ్చిన ఆయన స్థానికుల సహాయంతో ఆమె నిలదీశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేష్ మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండడంతో తహసిల్దార్ మునీరుద్దీన్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పి అన్నారు.
