Asianet News TeluguAsianet News Telugu

ఆస్తి తన పేర రాయనన్నాడని.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య..

ఆస్తికోసం ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసిందో ఇల్లాలు. తల్లిదండ్రులతో కలిసి దారుణానికి ఒడిగట్టింది. 

wife assassinated husband over property disputes in nagarkurnool
Author
First Published Dec 26, 2022, 7:20 AM IST

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. తన పేరుమీద ఆస్తిని రాయడానికి భర్త ఒప్పుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న ఆ భార్య… తల్లిదండ్రులతో కలిసి, భర్తను చంపేసింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనకు  సంబంధించి పోలీసులు  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూలు జిల్లా అయ్యవారిపల్లి  గ్రామానికి చెందిన చింతల  సైదయ్య (34)అనే వ్యక్తి..  హైదరాబాద్ కు చెందిన సోనీ అనే మహిళను పదేళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం సజావుగానే సాగింది. 

సైదయ్యకు మూడు ఎకరాల భూమి ఉంది. అయితే,  ఏడాది క్రితం సైదయ్య రూ. 19 లక్షలకు ఒక ఎకరం భూమిని అమ్మాడు. అప్పటినుంచి గొడవలు మొదలయ్యాయి. కాగా ఈ భూమి అమ్మిన డబ్బుతో పాటు.. మిగతా ఆస్తులు కూడా తన పేరు మీదపెట్టాలని భర్తతో గొడవకు దిగింది సోనీ. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కామన్ గా మారిపోయింది. ఈ క్రమంలో సోనీ తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం వీరు ఉంటున్న అయ్యవారిపల్లికి వచ్చారు. ఆ రోజు రాత్రి కూడా  సోనీ, సైదయ్యల మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది. అర్ధరాత్రి బాండ్ పేపర్ లు తీసుకువచ్చిన సోని ఆస్తి మొత్తం తన పేరుపై రాయాలని సైదయ్యను ఒత్తిడి చేసింది. 

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. 4 కార్లు, 2 బైక్ల మీదికి దూసుకెళ్లిన టిప్పర్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు..

ఎంత గొడవ పడ్డా, ఎన్నిసార్లు అడిగినా సైదయ్య ససేమిరా అంటూ  ఉండటంతో… పట్టరాని ఆగ్రహంతో సోనీ, ఆమె తల్లిదండ్రులు కలిసి  సైదయ్య మీద ఒక్కసారిగా దాడి చేశారు. అతని గొంతు నులిమి హత్య చేశారు. ఈ మేరకు ఎస్సై శేఖర్ గౌడ్ వివరాలు తెలిపారు. సైదయ్య, సోనీలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని సోదరి  సైదమ్మ ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భార్య సోనీ, అత్త జ్యోతి, మామ కృష్ణలపై కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ లో నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఆస్తి విషయంలో జరిగిన గొడవలో కోపానికి వచ్చిన తండ్రి కన్నకొడుకునే కర్కశంగా కడతేర్చాడు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరా గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. దండ్ల సుమన్ (25) ఇటీవల దుబాయ్ కి వెళ్లి స్వగ్రామానికి తిరిగివచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తండ్రి పెద్ద రమేష్ తో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తాను గల్ఫ్ లో ఉండగా పంపిన డబ్బులు  ఏమయ్యాయి? తన భార్యకు ఎందుకు ఇవ్వలేదు? ఆస్తి పంచి ఇవ్వాలంటూ సుమన్ ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో తండ్రిని నిలదీశాడు.

అయినా తండ్రి రమేష్ స్పందించలేదు. వినాయక నిమజ్జనం తర్వాత అర్ధరాత్రి దాటాక సుమన్ తండ్రి ఇంటికి వచ్చాడు. అక్కడున్న తన ద్విచక్ర వాహనాన్ని తీసుకు వెళ్లడం కోసం వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ గొడవ జరిగింది. ఈ గొడవతో ఉద్రేకానికి లోనైన తండ్రి పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని కొడుకు మీద దాడి చేశాడు. గొడ్డలితో నరకడంతో సుమన్ మెడ సగభాగం తెగిపోయింది. దీంతో అతను రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తరువాత కాస్త కూడా భయం, ఆందోళన లేకుండా.. రక్తపు మరకలని నీటితో కడిగేసి తండ్రి పరారయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios