పెళ్లై పదహారేళ్లు గడిచిన తరువాత ఓ భార్య దారుణానికి తెగబడింది. పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపింది. అత్యంత దారుణంగా హతమార్చి.. సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. కాకపోతే ఆమె అనుకున్నది జరగలేదు. 

నల్గొండ : extra marital affairకి భర్త అడ్డొస్తున్నాడని loverతో కలిసి భర్తను murder చేసింది ఓ భార్య. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పట్టణ టూటౌన్ పోలీసులు, ఈ కేసు వివరాలను బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పానగల్ కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (41) వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేస్తూ, భార్య సుజాత కూలి మేస్త్రిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య సుజాత కూలి పనులకు వెళ్లిన క్రమంలో నార్కెట్ పల్లి మండలంలోని చెరువుగట్టుకు చెందిన కప్ప లింగస్వామితో అక్రమ సంబంధం ఏర్పడింది. 

ఈ బంధం కాస్త బలపడడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా సుజాత జనవరి 29న రాత్రి ప్రియుడు లింగస్వామికి ఫోన్ చేసి తన భర్త మద్యం తాగి నిద్రపోయాడని హత్యకు ఇదే సరైన సమయం అని ప్రియుడికి తెలిపింది. దీంతో లింగస్వామి అతడి స్నేహితుడైన నార్కెట్ పల్లి మండలంలోని గుమ్మళ్ల బావికి చెందిన చెన్నకేశవరెడ్డి, చెర్వుగట్టుకు చెందిన శ్రీకాంత్ తో బైక్ మీద పట్టణానికి వచ్చారు. 

శ్రీకాంత్ లింగస్వామిని దించి వెళ్లి పోయాడు. చెన్నకేశవరెడ్డి, లింగస్వామి ో మెడికల్ షాపులో చేతి గ్లౌజులు కొనుగోలు చేసి రాత్రి పానగల్ కట్ట మీద వేచి ఉన్నారు దీంతో సుజాత అర్థరాత్రి తర్వాత ప్రియుడు లింగస్వామికి వాట్సాప్ కాల్ చేసి రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్లిన ప్రియుడు లింగస్వామి వెంకన్న ముఖం మీద దిండుతో, గొంతు మీద అదిమి పట్టగా భార్య కాళ్లను పట్టుకుని హత్య చేశారు.

వెంట వచ్చిన చెన్నకేశవరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నాడు. సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి భిక్షమయ్య ఫిర్యాదుతో పోలీసులు సుజాతను తనదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. మృతుడు వెంకన్నకు గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన సుజాతతో 16యేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. హత్యకు సహకరించిన వారిని, ప్రియుడు, భార్య సుజాతను గతంలో హత్య చేయాలని ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ప్రియుడి మోజులో husbandను హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో ఫిబ్రవరి 1న వెలుగుచూసింది. ఘటనకు సంబంధించి ప్రియుడితో పాటు మహిళనూ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర (40), బోయ విజయలక్ష్మి దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా తమ సమీప బంధువు చియ్యేడు సందీప్ తో విజయలక్ష్మి extra marital affair కొనసాగిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తరచూ కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో ravindraకు ఊపిరాడకుండా చేసి murder చేశారు. ఆ తర్వాత snake byteతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందకపోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోస్ట్మార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయలక్ష్మి, సందీప్ ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం రిమాండ్కు తరలించారు.