ఇటీవల మళ్లీ శివశంకర్ భార్యను వేధిస్తుండటంతో ప్రియుడు, ఆమె కలిసి అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. మాయమాటలతో జహంగీర్ అతడిని మంగళవారం మైతాప్ ఖాన్ గూడకు తీసుకునివెళ్లి మద్యం తాగించాడు. 

సంగారెడ్డి : భర్త మృతికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు మోమిన్ పేట్ సీఐ వెంకటేశం తెలిపారు. వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 

మండలానికి చెందిన చిన్నమల్కు శివశంకర్ (30)కు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. సంవత్సరం క్రితం ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. 

ఆ సమయంలో సంగారెడ్డికి చెందిన జహంగీర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా Extramarital affairకి దారి తీసింది. ఇటీవల మళ్లీ ఆమె భర్త దగ్గరకు రావడంతో జహంగీర్ శివశంకర్ తో పరిచయం పెంచుకున్నాడు. 

ఇద్దరూ కలిసి Alcohol తాగేవారు. ఇటీవల మళ్లీ శివశంకర్ భార్యను వేధిస్తుండటంతో ప్రియుడు, ఆమె కలిసి అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. మాయమాటలతో జహంగీర్ అతడిని మంగళవారం మైతాప్ ఖాన్ గూడకు తీసుకునివెళ్లి మద్యం తాగించాడు. 

తాగిన మైకంలో ఉన్న అతడిపై రాళ్లతో దాడి చేసి Murderకు ప్రయత్నించాడు. తీవ్రగాయాల పాలైన శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. 

ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్​ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?

మూడు రోజుల్లో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం...
మరోవైపు నందిగామలో ఓ యువతి మూడు రోజుల్లో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. మాజీ Miss Telangana కలక భవాని అలియాస్ Hasini మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.

శుక్రవారం నాడు ఆమె నందిగామ సమీపంలోని Keesara బ్రిడ్జి పై నుండి మున్నేరులో దూకింది.వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు మున్నేరులోకి దూకి ఆమెను కాపాడారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆమె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతుంది.

హాసిని బుధవారం నాడు రాత్రి పదిన్నర గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొంటూ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేశారు. తల్లిదండ్రులు స్నేహితులు ఫోన్ చేస్తున్నా కూడా ఆమె పట్టించుకోలేదు. తాను చెప్పాలనుకొన్న విషయాలు చెప్పి స్టూల్ తన్నేసింది. 

అయితే లైవ్ లో ఈ దృశ్యాలను చూసిన ఆమె స్నేహితుడు 100 ఫోన్ చేశారు. నారాయణగూడ పోలీసులు హిమాయత్‌నగర్ లో ఆమె ఉండే ఇంటికి చేరుకొన్నారు. అయితే ఆమె ఫ్యాన్ కు బిగించుకొన్న చున్నీ ముడి ఊడిపోయి మంచంపై పడిపోయింది. 

తలుపులు పగులగొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు.గురువారం నాడు ఉదయం హాసినిని ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని హైద్రాబాద్ హిమాయత్‌నగర్ ‌లోని ఓ అపార్ట్‌మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటుంది.2018 లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన పోటీలో హాసిని మిస్ తెలంగాణకు ఎంపికైంది.