హైదరాబాద్‌: తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడో భర్త. భార్యకు వాట్సప్ కాల్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పేశాడు. తమ వివాహ బంధం నేటితో ముగిసిపోయిందని...ఇకపై నీతో సంబంధం లేదని ఫోన్లోనే చెప్పేశాడు. మూడు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే యూసఫ్ గూడకు చెందిన సమియాభానుకు టోలీచౌకీకి చెందిన మహ్మద్ ముజమ్మిల్‌ షరీఫ్ తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొంతకాలంపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే సమియాబాను ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత ఆ కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. 

ఆడపిల్లను కన్నావంటూ తనను వదిలించుకుని షరీఫ్ మరో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. నిత్యం ఆమెకు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు  నమియాభాను చెప్తోంది. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయినట్లు చెప్పింది. 

టోలిచౌకిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా మహ్మద్ ముజమ్మిల్ షరీఫ్ విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు మూడు వారాల క్రితం అంటే నవంబరు 28, 2018న ఫోన్‌ చేశాడు. భర్త ఫోన్ చెయ్యడంతో మనసు మారిందని సంబరపడుడూ ఆ ఇల్లాలు ఎంతో ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. అంతలోనే షరీఫ్ పిడుగులాంటి నిర్ణయం చెప్పేశాడు. 

ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు తలాక్ తలాక్ తలాక్ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడని ఆమె వాపోయింది. ఊహించని పరి  గతేడాది జనవరిలో అక్కడే ఉంటున్న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం ఆ యువతి ఆడశిశువుకు జన్మనిచ్చింది. 

ఆడపిల్లకు జన్మనివ్వడంతో అప్పటి నుంచి ముజమ్మిల్‌ ఆమెను వేధిస్తుండేవాడు. పుట్టింట్లో ఉన్న ఆమెకు . ఆమె హలో అనగానే ‘తలాక్‌’ అంటూ మూడు సార్లు చెప్పాడు. నేటితో మన వివాహ బంధం రద్దు అయ్యిందని చెప్పేసి మారుమాట వినకుండా ఫోన్ పెట్టేశాడని ఆమె వాపోయింది.

భర్త ఫోన్లో తలాక్ చెప్పడంతో నివ్వెరపోయిన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు. 

అనంతరం తనకు న్యాయం చేయాలంటూ భర్త మహ్మద్ ముజమ్మిల్ షరీఫ్ ఇంటి వద్ద ధర్నాకు దిగింది నమియాభాను. అయితే భర్త ఇంట్లో లేడని తెలియడంతో భర్త పనిచేసే పాఠశాల ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న షరీఫ్ అక్కడ నుంచి పరారయ్యాడు. 

తనలా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా కాపాడాలని సమియా కోరుతోంది. చట్టరిత్యా ట్రిబుల్ తలాక్‌ చెల్లదని అతనిపై వరకట్న వేధింపులకు సంబంధించి ఐపీసీ 498 ఏ, 406, 506, డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీసీఎస్ పోలీసులు తెలిపారు. షరీఫ్‌ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.