హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై  ఒత్తిడి తెస్తోంది. గతంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుగా మారింది... కాళేశ్వరం ప్రాజెక్టును విపక్షాలు వ్యతిరేకించాయి. అయితే అధికార, విపక్షాలు తమ తమ వాదనలను సమర్ధించుకొనేందుకు ప్రయత్నాలు చేశాయి. ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

ప్రాణహిత...చేవేళ్ళ ప్రాజెక్టులను రెండు ప్రాజెక్టులుగా విభజించారు..ఆదిలాబాద్ జిల్లా అవసరాల కోసం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించనున్నారు.ఈ బ్యా,రేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లా అవసరాల కోసం రెండులక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు..తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా లక్ష ఎకరాలకు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రభుత్వంప్లాన్ చేసింది.

తెలంగాణలోని 7 జిల్లాలకు సాగు, తాగునీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించారు.తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణాన్ని మహారాష్ట్ర సిఎం  ఫడ్నవీస్ వ్యతిరేకించారు.గోదావరి నదిలో 160 టిఎంసిల నీటినిప్రాజెక్టు నిర్మాణానికి వాడుకోవచ్చని...ఎత్తు విషయంలో మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైన్ పై ఆలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాణహిత.. చేవేళ్ళ ప్రాజెక్టును రెండు ప్రాజెక్టులుగా విభజించారు.

తుమ్మిడి హెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం వల్ల మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉండనుంది. ఈ ముంపుకు వ్యతిరేకంగా  నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఫడ్నవీస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాడు. 

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున ఈ ప్రతిపాదనకు ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. మరో వైపు తుమ్మిడి హెట్టి  వద్ద కంటే కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్లే ఏడాది పాటు  గోదావరి నుండి నీటిని లిఫ్ట్ చేసుకొనే వెసులుబాటు ఉంటుందని తెలంగాణ సర్కార్ భావించింది. ఈ మేరకు తుమ్మిడి హెట్టి వద్ద కాకుండా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం పూనుకొంది. ప్రాణహిత చేవేళ్లకు బదులుగా ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా అవసరాల కోసం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించాలని తలపెట్టారు.కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు..ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత ..చేవేళ్ళ ప్రాజెక్టు పేరుతో తలపెట్టిన ప్రాజెక్టు ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరాన్ని రూపొందించారు. గోదావరిలో తెలంగాణ వాటా మేరకు 120 టిఎంసి ల నీటిని వాడుకొనేందుకు వీలుగా రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ ను నిర్మించనున్నారు.ఇక్కడి నుండి తెలంగాణలోని ఇతర జిల్లాలకు నీటిని తరలించనున్నారు.మేడిగడ్డ వద్ద103 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ ను నిర్మించారు.ఇక్కడ 26.77 టిఎంసి ల నీటిని నిల్వ చేసుకోనే అవకాశం ఉంది. 

మేడిగడ్డ నుండి అన్నారం వరకు నీరు ప్రవాహాం ద్వారా వస్తోంది.ఇక్కడ మరో చిన్న బ్యారేజీని నిర్మిస్తున్నారు.ఇక్కడ 2.7 టిఎంసి ల నీటిని నిల్వ చేసుకొనే అవకాశం ఉంది.సుందిళ్ళ చిన్న బ్యారేజీని నిర్మించనున్నారు.ఇక్కడ 1.08 టిఎంసి ల నీటిని నిల్వ చేసుకొనే అవకాశం ఉంది.సుందిళ్ళ నుండి ఎల్లంపల్లి వరకు ప్రవాహాం ద్వారా నీటిని పంపుతారు.

ఎల్లంపల్లి నుండి తెలంగాణలోని ఇతర జిల్లాలకు సరఫరా చేస్తారు.ప్రాణహిత...చేవేళ్ల ప్రాజెక్టు ఆయకట్టులోని ప్రతిపాదిత 16.5 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజీల ద్వారా నీటిని అందించనున్నారు.అంతేకాదు ఈ ఆయకట్టుకు అందించే నీటిని నిల్వ చేసుకొనేలా బ్యారేజీలను నిర్మించనున్నారు.

మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి 6325 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా ..ఇక్కడి నుండి నీటిని పంపింగ్ చేయడానికి 450 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది.అన్నారం వద్ద బ్యారేజీ నిర్మాణానికి3576 కోట్లు ఖర్చు చేస్తారు.ఇక్కడ నీటిని ఎత్తిపోయడానికి 270 మెగావాట్ల విద్యుత్ అవసరం.సుందిళ్ళ వద్ద బ్యారేజీ నిర్మాణానికి 3694 కోట్లు ఖర్చు అయ్యాయి.260 మెగావాట్ల విద్యుత్ అవసరమౌతోంది.

ఈ మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి 13,594 కోట్లు ఖర్చు చేయనున్నారు.1080 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది.సుందిళ్ళ వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం వద్ద1437 కోట్లతో, అన్నారం వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం1785 కోట్లు, మేడిగడ్డ వద్ద2591 కోట్లతో బ్యారేజీ నిర్మించారు. ఈ మూడు ఎత్తిపోతలతో పాటు....ఇతర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలకు 4500 మెగావాట్ల విద్యుత్ అవసరమౌతోంది. అయితే అయితే అంచనా వ్యయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొన్నాయి.

మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ నిర్మాణం వల్ల 13,074హెక్టార్ల భూమి ముంపుకు గురౌతోందని తెలంగాణ చెబుతోంది.ఇందులో మహారాష్ట్రకు చెందిన భూమి సుమారు 1227 హెక్టార్లు మాత్రమే.తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూమి సుమారు 1629 హెక్టార్లు.గోదావరి నదిలో సుమారు 10,218 హెక్టార్లు ముంపుకు గురికానుంది..మేడిగడ్డ వద్ద 101 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రకు ఒకే చెప్పడంతో ఈ ప్రాజెక్టు పనులు శరవేంగా పూర్తయ్యాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో 4,54,500 ఎకరాలకు, కరీంనగర్ లో 2,01,449 ఎకరాలకు, మెదక్ లో 7,30,646 ఎకరాలకు, వరంగల్ లో 20,595 ఎకరాలకు, నల్గొండలో 2,62,360 ఎకరాలకు ,రంగారెడ్డిలో 50 వేల ఎకరాలకు సాగు నీరందించనున్నారు.

మెదక్ జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టు5,19,152 ఎకరాలతో పాటు అదనంగా 2,11,494 ఎకరాలను ప్రతిపాదించారు.దీంతో మెదక్ జిల్లాలో 7,30,646 ఎకరాలకు పెరిగింది.వరంగల్ లో తొలుత 11,863 ఎకరాలను ప్రతిపాదించగా...అదనంగా మరో 8732 ఎకరాలను ప్రతిపాదించారు.దీంతో 20,595 ఎకరాలకు పెరిగింది.నల్గొండలో 2,29,832 ఎకరాలను ప్రతిపాదించగా...అదనంగా 32528 ఎకరాలను ప్రతిపాదించారు.

దీంతో 2,62,360 ఎకరాలకు పెరిగింది.ఈ ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాలో తొలుత 2,46,704 ఎకరాలను ప్రతిపాదించారు. అయితే అదనంగా మరో 50 వేల ఎకరాలను ప్రతిపాదించారు.అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా...పాలమూరు..రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దరమిలా తొలుత ప్రతిపాదించిన 2,46,704 ఎకరాల ఆయకట్టును ఈ ప్రాజెక్టు నుండి తీసివేశారు.

దీంతో రంగారెడ్డి జిల్లాకు ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీరందే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని సర్కార్ ప్రతిపాదించింది.


సంబంధిత వార్తలు

రికార్డులు బద్దలు కొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు