Asianet News TeluguAsianet News Telugu

రికార్డులు బద్దలు కొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు

 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించనుంది.

kaleshwaram project creates new records in irrigation sector
Author
Hyderabad, First Published Jun 19, 2019, 11:22 AM IST


హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడ పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించనుంది.

తెలంగాణలో 45 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు మిషన్ భగీరథ పథకం కింద అవసరమైన నీటిని  అందించేందుకు ఈ ప్రాజెక్టు రూపొందించారు. సుమారు కోటి జనాభా ఉన్న  హైద్రాబాద్‌ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు.  92 మీటర్ల నుండి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని లిఫ్ట్ చేసేలా దశలవారీగా లిఫ్టులను ఏర్పాటు చేశారు.  

మేడిగడ్డ వద్ద 92 మీటర్ల ఎత్తులో లిప్టును ఏర్పాటు చేశారు.  ఎల్లంపల్లి వద్ద 148 మీటర్ల ఎత్తులో లిఫ్టును ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ 56 మీటర్ల ఎత్తులో నీటిని పంప్ చేస్తోంది. మిడ్‌మానేర్ వద్ద 318 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. 

ఈ లిఫ్ట్ ద్వారా 170 మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్  చేయనుంది.  శ్రీరాం సాగర్ వద్ద 332.54 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ ఏర్పాటు చేశారరు. ఇక్కడి నుండి 14.54 మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్ చేస్తారు.మలక్‌పేటలో432.50, అనంతగిరిలో 397,రంగనాయక్ సాగర్490, మల్లన్నసాగర్ 557, కొండపోచమ్మ సాగర్‌లో 618 మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్ చేయనున్నారు.

ఈ ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసే విధంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 139 మెగావాట్ల గరిష్ట సామర్థ్యం ఉన్న పంపులను నీటిని లిఫ్ట్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు.అంతేకాదు ఈ ప్రాజెక్టులో సుమారు 203 మీటర్ల పొడవున సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతి పొడవైంది.

ప్రతి రోజూ రెండు టీఎంసీ నీటిని గోదావరి నుండి ఎత్తిపోసేందుకు వీలుగా మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. ప్రపంచంలో రెండు టీఎంసీల నీరు ఎత్తిపోసే ప్రాజెక్టు కాళేశ్వరం ఒక్కటే.  వచ్చే ఏడాది నుండి  ప్రతి రోజూ మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేలా తెలంగాణ సర్కార్ ప్లాన్ చేసింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకొంది.ఈ నెల 21వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios