Asianet News TeluguAsianet News Telugu

డీహెచ్ శ్రీనివాసరావు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యవహారిస్తున్న తీరు పలు సందర్భాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన శ్రీనివాసరావు.. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూనే ఆయన చేస్తున్న కామెంట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

Why KCR Being Silent over DH Srinivasa Rao Controversies ksm
Author
First Published Jun 5, 2023, 10:55 AM IST

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యవహారిస్తున్న తీరు పలు సందర్భాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన శ్రీనివాసరావు.. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూనే ఆయన చేస్తున్న కామెంట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. పలువురు సివిల్ సర్వెంట్స్‌గా పనిచేసిన అధికారులు కూడా రాజకీయాల్లో తమ  అదృష్టాన్ని పరీక్షించారు. అయితే వారు ఉద్యోగాలకు రాజీనామా చేసిన తర్వాతే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పోయింది. 

అయితే తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఒకరిగా ఉన్న డీహెచ్ శ్రీనివాస్ రావు.. మాత్రం ఓవైపు ఉద్యోగంలో కొనసాగుతూనే, మరోవైపు పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా తాను పోటీ చేయాలని భావిస్తున్న కొత్తగూడెంకు మాత్రమే ఎక్కువగా పరిమితమవుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా.. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్‌లో ప్రత్యక్షమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్దికి సంబంధించి కామెంట్స్ చేస్తూనే.. స్థానిక ఎమ్మెల్యే వనమాను టార్గెట్ చేసుకుంటున్నారు. కొత్తగూడెంకు కొత్త ఉదయం కావాలని అంటున్నారు. కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందామంటూ పిలుపునిస్తున్నారు. 

Also Read: నక్సలైట్ అవుదామనుకున్నా .. గన్ను పట్టాల్సింది, పెన్ను పట్టాకున్నా : డీహెచ్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

మరోవైపు కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ  చేయాలని భావిస్తున్న శ్రీనివాసరావు.. అందుకు సంబంధించి తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మెప్పు పొందేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌‌ను పొగడ్తలతో ముంచెత్తడం.. ఆయన  ఆశీర్వాదం కోసం పాదాలకు నమస్కరించడంపై కూడా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగింది. పలువురు నెటిజన్లు శ్రీనివాసరావు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం బరిలో బీఆర్ఎస్ నుంచి ఎవరూ నిలుస్తారనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో సాగుతుంది. ఓవైపు పార్టీలో కన్ఫ్యూజన క్రియేట్ అవుతుండటం.. మరోవైపు ప్రభుత్వ అధికారి అయి ఉండి పరిధి దాటి కామెంట్స్ చేస్తున్న శ్రీనివాసరావు విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు.. తన పదవికి రాజీనామా చేసి పొలిటికల్ కామెంట్స్ చేస్తే తప్పు పట్టేవారు ఎవరూ ఉండరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ.. రాజకీయాలు మాట్లాడటమేనని ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios