Asianet News TeluguAsianet News Telugu

కీచక రాఘవ ఎక్కడున్నాడు.. పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ‌డం లేదు - టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వనామా రాఘవేంద్రరావు ఎక్క‌డున్నాడ‌ని, ఆయ‌య‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయ‌లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం ఉద‌యం ట్వీట్ చేశారు. 

Where is Keechaka Raghava .. why police are not arresting him yet - TPCC President Rewanth Reddy
Author
Hyderabad, First Published Jan 7, 2022, 10:51 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన నాగ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్యకు కార‌ణ‌మైన వారిని ఇంకా అరెస్టు చేయ‌క‌పోవ‌డంతో పోలీసుల‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు నిన్న పోలీసుల‌కు లొంగిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అత‌డు ఇంకా దొర‌క‌లేద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి అధికార పార్టీపై, పోలీసుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 

ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వనామా రాఘవేంద్రరావు ఎక్క‌డున్నాడ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అత‌డిని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఉంచారా లేక ఫాంహౌస్‌లో ఉంచారా అని అన్నారు. అత‌డిని కాపాడుతున్న‌ది ఎవరు, టీఆర్ఎస్ పెద్ద‌లు ఈ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ‘‘కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా,  ఫాంహౌస్ లోనా? అక్రమాలను ప్రశ్నించే వారిని నిముషాల్లో అరెస్టు చేసిన పోలీసులు మానవమృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం ఏమిటి?  దుర్మార్గుడిని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? దారుణ ఘటన పై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటి?’’ అంటూ ట్వీట్ చేశారు. 

ఏం జ‌రిగిందంటే.. ? 
ఈ నెల 3వ తేదీన పాల్వంచలో నాగ‌ రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఆత్మ‌హ‌త్య‌కు ముందు అత‌డు తీసుకున్న సెల్ఫీ వీడియో త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో అత‌డు ప‌డిన మానసిక క్షోభ‌ను అంతా వివ‌రించాడు. వనమా రాఘవేందర్ తనతో ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాడ‌నే విష‌యాల‌న్నీ చెప్పాడు. త‌న స‌మ‌స్య ప‌రిష్కారం కావాలంటే భార్య శ్రీల‌క్ష్మిని హైద‌రాబాద్ తీసుకొని రావాల‌ని వ‌న‌మా రాఘ‌వేంద‌ర్ రావు చెప్పార‌ని తెలిపాడు.  పిల్లలు లేకుండా తన భార్యతో హైద్రాబాద్ కు వస్తేనే తన సమస్యను పరిష్కరిస్తానని అత‌డు తనను బెదిరించారన్నారు. శ్రీలక్ష్మితో తన వివాహమై 12 ఏళ్లైనా ఎలాంటి పొరపొచ్చాలు లేవని చెప్పాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలో చెప్పండి అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డబ్బులైతే ఇస్తాం కానీ, భార్యను ఎలా పంపాలని ఆయన ఆ వీడియోలో ప్రశ్నించారు.

త‌న‌ భార్యను ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు త‌న‌ సమస్య పరిష్కారం అవుతుందని వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. రాజకీయ, ఆర్ధిక బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి వ్య‌క్తి వ‌ల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని రామకృష్ణ ఆవేద‌నతో చెప్పారు.  అయితే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కరం రేపింది. అత‌డిని ప‌ట్టుకోవాల‌నే డిమాండ్‌లు ఎక్కువ‌య్యాయి. ఈ క్ర‌మంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వ‌యంగా బుధ‌వారం సాయంత్రం త‌న కుమారుడిని పోలీసుల‌కు అప్ప‌గించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వనమా రాఘవేందర్ ను అరెస్టు చేశార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అత‌డు అరెస్టు కాలేద‌ని కొత్తగూడెం పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios