తెలంగాణలో సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?.. కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Solapur: "తాము బీజేపీకి 'బీ' టీం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు 'ఏ' టీం అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, బీఆర్ఎస్ ఏ పార్టీకి టీం కాదు. రైతులు, దళితులు, బీసీలు, పేద ప్రజలే మా టీం. ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి. అందుకే దేశంలో రైతు ప్రభుత్వం రావాల్సివుందని" తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి నాయకుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు.
KCR's strong counter to Congress, BJP: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి నాయకుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) భారీ కాన్వాయితో మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం రాజకీయాల్లో హీట్ పెంచింది. ప్రధాన రాజకీయ పార్టీలన్ని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే విమర్శలు చేసే వారికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "తాము బీజేపీకి 'బీ' టీం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు 'ఏ' టీం అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, బీఆర్ఎస్ ఏ పార్టీకి టీం కాదు. రైతులు, దళితులు, బీసీలు, పేద ప్రజలే మా టీం. ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి. అందుకే దేశంలో రైతు ప్రభుత్వం రావాల్సివుందని" తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి నాయకుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోలాపుర్ లోని సర్కోలీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, తెలంగాణ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ది సాధ్యం కాదని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదన్నారు. పుష్కలంగా వనరులు ఉన్నప్పటికీ అభివృద్ది విషయంలో మహారాష్ట్ర ఇలా ఉండాల్సింది కాదనీ, మరింత అభివృద్ది చెందాల్సి ఉండాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు గడిచిపోయాయనీ, అయితే, అభివృద్ది వ ఎలా ఉందనేది ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ది విషయంలో చైనా ఎక్కడుంది? భారత్ ఎక్కడుంది అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడుతూ.. దేశాన్ని దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించిందనీ, మహారాష్ట్రలో ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు అవకాశం ఇచ్చారు కానీ తెలంగాణలో సాధించిన అభివృద్ది మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. తమ పార్టీ రైతుల పక్షాన, పేదల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మార్పుతో భారత్ ముందుకు నడవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తమపార్టీ దూకుడుతో ఇతర రాజకీయ పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయనీ, ఎవరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేదే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ విస్తరణ కొనసాగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని సరికొత్త భాష్యం చెప్పిన కేసీఆర్.. తాము దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పార్టీ అని అన్నారు. కేంద్రానికి దమ్ముంటే ప్రతీ ఎకరానికి నీరు అందించాలని సవాల్ విసిరారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో వుందనీ, ప్రభుత్వంలో సత్తా ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని తెలిపారు. పాత విధానాలను బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.