కొత్త భవనాలతో పెట్టుబడులు వస్తాయి: ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు

కొత్త అసెంబ్లీ నిర్మాణం పై బుధవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి. గురువారం నాడు కూడ వాదనలను కొనసాగనున్నాయి. ఎర్రమంజిల్ ను కూల్చేసి కొత్త అసెంబ్లీని నిర్మించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.

what is wrong in construct new assembly asks high court

హైదరాబాద్: ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొత్త భవనాలు మేలు చేస్తాయని హైకోర్టు అభిప్రాయపడింది.ఎర్రమంజిల్ కూల్చివేతపై బుధవారం నాడు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎర్రమంజిల్  కూల్చివేతపై బుధవారం నాడు కూడ వాదనలు జరిగాయి. గత పది రోజులుగా  హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఈ విషయమై కోర్టు తీర్పు వెలువడే అవకాశం లేకపోలేదు.

కొత్త రాష్ట్రానికి కొత్త అసెంబ్లీ నిర్మించడంలో  తప్పు ఏమిటని కోర్టు ప్రశ్నించింది. పంజాబ్ రాష్ట్రంలో చండీఘడ్ లాంటి  రాజధానిని నిర్మించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  ఖాళీ స్థలం ఉంటే  కొత్త అసెంబ్లీ భవనం నిర్మించడానికి తమకు అభ్యంతరం లేదని .పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై గురువారం నాడు వాదనలు జరగనున్నాయి.

కొత్త అసెంబ్లీతో పాటు కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారు.గత నెల 27వ తేదీన ఈ రెండు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios