Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ చెప్పిన 15 లడ్డూల కథ ఏంటిదబ్బా?

  • అర్చకులతో సంతోషంగా చెప్పిన కేసిఆర్
  • 15 సంఖ్య ఎందుకు చెప్పారబ్బా అని జనాల్లో చర్చ
what is story of kcrs 15 laddoos

తెలంగాణ సిఎం కేసిఆర్ విలక్షణమైన రాజకీయ నేత. ఆయన ఏదైనా మాట మాట్లాడినా.. డైలాగ్ కొట్టినా అవతలి వారు అర్థం చేసుకోవడానికి పుష్కర కాలం పడతది. అంతటి నిగూఢ రహస్యం దాగి ఉంటది ఆయన మాటల్లో.

తాజాగా అర్చక సంఘాల ప్రతినిధులతో సిఎం క్యాంపు ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి మూడు హామీలు ఇచ్చారు. వాటి తాలూకు జీఓలు కూడా వెంటనే తయారు చేయించి అర్చకుల చేతిలో పెట్టారు. నవంబరు నుంచి సర్కారు ఉద్యోగులకు ఇచ్చినట్లే జీతాలిస్తామని, అర్చకుల కోసం ధార్మిక పరిషత్ ఏర్పాటు ఇలా హామీలు ఇచ్చారు.

ఇదంతా బాగానే ఉన్నా ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు అర్చకులను ఉద్దేశించి... అదేమంటే మీ సమస్యలు పరిష్కరించడంతో నాకు 15 లడ్డూలు తిన్నంత ఆనందంగా ఉంది అని అర్చకులతో అన్నారు కేసిఆర్.

మరి అర్చకులతో 15 లడ్డూలు తిన్నంత అని ఎందుకున్నారబ్బా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ సంతోషంగా అలా అంటే 15 అనే సంఖ్య ఎందుకన్నారు? పెద్ద లడ్డూ తిన్నంత ఆనందంగా ఉంది అనొచ్చు కదా? లేకపోతే 10 లడ్డూలు తిన్నంత అనొచ్చు కదా? 15 అనే నెంబరు ప్రత్యేకంగా ఎందుకన్నారబ్బా అన్న సంశయం నెలకొంది.

అయితే కేసిఆర్ వాస్తును వందకు వంద శాతం విశ్వసిస్తారు. అయ్యగార్లతో వాస్తు ప్రకారమే 15 లడ్డూల ముచ్చట చెప్పిర్రా ఏందబ్బా అన్న చర్చ కూడా ఉంది. కేసిఆర్ కు అచ్చొచ్చే అంకె 6. మరి 15 లడ్డూలు అంటే అందులోని సంఖ్యను లెక్కిస్తే 6 వస్తుంది కాబట్టే అలా అని ఉండొచ్చని కదా అని ఇంకొందరు చమత్కరిస్తున్నారు. ఏమైనా కడుపు నిండే వార్త చెప్పిండు కదా ఈ లడ్డూల గురించి ఎందుకులే అనుకొంటున్నారు కొందరు అయ్యగార్లు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios