మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. నిన్న ఒక్కరోజే 32 సెం.మీ. ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 

దీని ప్రభావంతో ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్య నగర వాసులు బిక్కు బిక్కుమంటున్నారు. నగరంలోని పలు తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

అనేక కాలనీలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9మంది మృతి చెందారు. మరో రెండు రోజులు వర్సాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ ఎంసీ అదికారులు హెచ్చరించారు. హైదరాబాద్  విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్ మెట్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది.