Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల ఎన్ కౌంటర్: దోషులు ఎవరో తేలిందన్న సుప్రీంకోర్టు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సిర్పూర్కర్ కమిసన్ నివేదికను బయటపెట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది పట్టుబడ్డారు. అయితే ఈ నివేదిక బయటకు వస్తే సమాజంపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.

We wont Disclose  Sirpurkar Commission report Says CJI NV Ramana
Author
Hyderabad, First Published May 20, 2022, 12:29 PM IST

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన  Sirpurkar Commission నివేదిక తమకు అందిందని Supreme Court చీఫ్ జస్టిస్ NV Ramana ప్రకటించారు.  దోషులు ఎవరో తేలిందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. 

Disha నిందితుల ఎన్ కౌంటర్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిర్ప్కూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఇవాళ విచారణను ప్రారంభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతపర్చవద్దని కూడా ధర్మాసనంలో మరో జడ్జి హిమా కోహ్లి ప్రశ్నించారు.దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని కూడా సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రశ్నే లేదని కూడా సీజేఐ చెప్పారు. దిశ కేసును హైకోర్టుకు పంపుతామని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచన ప్రాయంగా తెలిపింది. 

ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని చెప్పాలని ప్రభుత్వ అడ్వకేట్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయమై 10 నిమిషాల సమయం ఇచ్చింది. 

మరో వైపు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బయట పెట్టాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హక్కుల సంఘాల తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. అయితే ఈ రిపోర్టు బహిర్గతమైతే సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన విచారణకు మాజీ సైబరాబాద్ సీపీ  వీసీ సజ్జనార్ హాజరయ్యారు.

హైద్రాబాద్ కు సమీపంలోని షాద్ నగర్ చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన 2019 నవంబర్ 28న జరిగింది.   ఈ ఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. 

నిందితులను తమకు అప్పగించాలని  పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు గాను ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్టుగా అప్పటిసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ ఘటన 2019 డిసెంబర్ 6న ఈ ఎన్ కౌంటర్  జరిగింది. 

ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశాయి. ఈ ఎన్ కౌంంటర్ పై అనుమానాలు వ్యక్తం చేశాయి. విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్ప్కూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సిర్పూర్కర్ కమిషన్  హైద్రాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది. ఈ కమిషన్ నివేదికను ఈ ఏడాది జనవరి మాసంలో సుప్రీంకోర్టుకు అందించింది. 

also read:దిశ నిందితుల ఎన్ కౌంటర్: రేపే సుప్రీం తీర్పు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్  విచారించింది.  వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను సిర్పూర్కర్ కమిషన్ ఉన్నత న్యాయస్థానానికి అందించింది. 

ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారులు సైబరాబాద్ సీపీగా అప్పట్లో పనిచేసిన వీసీ సజ్జనార్  సహా పోలీసు వ్యాన్ డ్రైవర్లను కూడా కమిషన్ విచారించింది కీలకమైన  రిపోర్టు తయారు చేసింది.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా కమిషన్ సభ్యులు పరిశీలించారు. అంతేకాదు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు అధికారిని కూడా  కమిషన్ విచారించి రిపోర్టు సిద్దం చేసింది. 

దిశ అదృశ్యమైన సమయంలో  పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని అప్పట్లో విమర్శలు తలెత్తాయి.ఈ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios