Asianet News TeluguAsianet News Telugu

రెండుమూడు రోజుల్లో విధి విధానాలు: విద్యాసంస్థల పున:ప్రారంభంపై హైకోర్టుకు కేసీఆర్ సర్కార్

విద్యాసంస్థల పున: ప్రారంభంపై రెండు మూడు రోజుల్లో విధి విధానాలను ఖరారు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపంది. 

we will submit report  within  3 days on physical classes to resume from july 1: telangana government lns
Author
Hyderabad, First Published Jun 23, 2021, 2:08 PM IST

హైదరాబాద్: విద్యాసంస్థల పున: ప్రారంభంపై రెండు మూడు రోజుల్లో విధి విధానాలను ఖరారు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపంది. రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభించడంపై  బుధవారంనాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జూలై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు  విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు.అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని  హైకోర్టు ప్రశ్నించింది.రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు.

ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుందని విద్యాఖ ప్రకటించింది.ప్రత్యక్ష తరగతులకు విద్యా సంస్థలు  తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని  విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. 


పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను  హైకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios