హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో జారీ చేసిన పాసులను దుర్వినియోగం చేస్తే వాటిని రద్దు చేస్తామని  హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. అంతేకాదు వాహనాలను కూడ సీజ్ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో మరింత కఠినంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో జారీ చేసిన పాసులను దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: హైద్రాబాద్ నుండి పిడుగురాళ్లకు కాలినడకన వలస కూలీ దంపతులు

అత్యవసర పనుల కోసం ఎవరైనా ఆన్ లైన్ లో పాసుల కోసం ధరఖాస్తు చేసుకోవాలని సీపీ సూచించారు. పాసుల కోసం ఎవరూ కూడ తమ కార్యాలయానికి రాకూడదని ఆయన ప్రజలను కోరారు. పాసుల జారీ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను ఉందని ఆయన వివరించారు.

సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసేవారికి పీపీఈ కిట్స్ అందించామన్నారు. అన్ని మతాల వారు ఇళ్లలోనే ఉండి ప్రార్ధనలు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి ఫోన్ చేసి చికిత్స చేసుకోవాలని సీపీ సూచించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కంటైన్మెంట్ జోన్లు ఉన్న కారణంగా పోలీస్ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకొంటుంది.