లాక్‌డౌన్ ఎఫెక్ట్: హైద్రాబాద్ నుండి పిడుగురాళ్లకు కాలినడకన వలస కూలీ దంపతులు
లాక్‌డౌన్ వలసకూలీల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లాక్ డౌన్ తో వలసకూలీలకు ఉపాధి లేకుండా పోయింది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తమ స్వంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు
నల్గొండ: క్‌డౌన్ వలసకూలీల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. . లాక్ డౌన్ తో వలసకూలీలకు ఉపాధి లేకుండా పోయింది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తమ స్వంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. హైద్రాబాద్ నుండి పిడుగురాళ్లకు వలసకూలీ దంపతులు కాలినడకన బయలుదేరారు. ఈ దంపతులు ఆదివారం నాడు సాయంత్రం నల్గొండకు చేరుకొన్నారు.
పిడుగురాళ్లకు చెందిన వలస కూలీ దంపతులు హైద్రాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. ఉపాధి కోసం వీరు పిడుగురాళ్ల నుండి ఎల్బీనగర్ కు వచ్చారు.. లాక్ డౌన్ నేపథ్యంలో వీరికి ఉపాధి లేకుండాపోయింది. లాక్‌డౌన్ మే 3వ తేదీకి పొడిగించింది కేంద్రం.
also read:తమిళనాడు నుండి మధ్యప్రదేశ్‌కి లారీలో 55 మంది కూలీలు: చిత్తూరులో పోలీసుల అరెస్ట్
ఇక హైద్రాబాద్‌లో ఉండడం కంటే తమ స్వగ్రామానికి వెళ్లడం ఉత్తమమని ఆ దంపతులు భావించారు. ఈ నెల 14 వ తేదీన హైద్రాబాద్ నుండి పిడుగురాళ్లకు కాలినడకన బయలుదేరు. తమ వెంట తెచ్చుకొన్న లగేజీని భార్య చేతిలో పట్టుకొంది. భర్త తమ కూతురిని ఎత్తుకొన్నాడు. ఈ దంపతులు నడుచుకొంటూ హైద్రాబాద్ నుండి పిడుగురాళ్లకు బయలుదేరారు.
ఆదివారం నాడు సాయంత్రం నల్గొండకు చేరుకొన్నారు. నల్గొండ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వలస కూలీ దంపతుల పరిస్థితిని తెలుసుకొని ఆహారం, బ్రెడ్ ప్యాకెట్లను అందించారు.