ఇక రోడ్లపైకి వస్తే అడ్రస్ ఫ్రూఫ్ తప్పనిసరి, ఉద్యోగులకు కలర్ కోడ్ పాసులు: డీజీపీ
లాక్ డౌన్ నేపథ్యంలో ఎమర్జెన్సీ పాసుల జారీపై సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. కొత్త పాసులు అమల్లోకి వచ్చే వరకు పాత పాసులను అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు.
హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో ఎమర్జెన్సీ పాసుల జారీపై సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. కొత్త పాసులు అమల్లోకి వచ్చే వరకు పాత పాసులను అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు.
సోమవారం నాడు సాయంత్రం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.రేపటి నుండి లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు.
also read:ఆదిలాబాద్: మద్యం దుకాణం పైకప్పు తొలగింపు, లిక్కర్ కోసమేనా..
నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు తమ వెంట ఇంటి అడ్రస్ ప్రూఫ్ ను తెచ్చుకోవాలన్నారు.ఆసుపత్రులకు వెళ్లే వారు కూడ తమ వెంట కూడ అడ్రస్ ఫ్రూప్ తెచ్చుకోవాలని ఆయన సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ఆ ఆసుపత్రికి రెఫరెన్స్ కోసం ఉన్న ప్రిస్కిప్షన్స్ తమ వెంట తీసుకురావాలని ఆయన కోరారు.
తమ ఇంటికి సమీపంలోని మూడు కిలోమీటర్ల దూరంలోనే నిత్యావసర సరుకులను తెచ్చుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు కలర్ కోడ్ తో కొత్త పాసులను జారీ చేస్తామని డీజీపీ తెలిపారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రతి ఉద్యోగులకు ప్రతి రోజూ ఒక్కో కలర్ చొప్పున పాసులు ఇవ్వాలని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి లేఖలు రాస్తున్నట్టుగా చెప్పారు. కొత్త పాసులు జారీ చేసే వరకు పాత పాసులను అనుమతి ఇస్తామన్నారు. రోజుకో కలర్ చొప్పున పాసులను ఇవ్వాలని డీజీపీ తెలిపారు.
రూట్ తో పాటు టైమింగ్ కోడ్ చేస్తూ ఈ పాసులను జారీ చేయాలని ఆయన ఆయా శాఖల హెచ్ఓడీలను కోరారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడ లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు.
అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. అంతేకాదు వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.కొందరు లాక్ డౌన్ సమయంలో తాము ఇచ్చిన పాసులను దుర్వినియోగం చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో కొత్త పాసును ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.