ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ మద్యం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. మద్యం బాటిల్స్ కోసమే పైకప్పు తొలగించి షాపులోకి ప్రవేశించారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకాణం పైకప్పు తొలగించి లోపలకి వెళ్లారు. ఈ దుకాణంలో డబ్బులు ఉండవు. మద్యం బాటిల్స్ కోసమే పైకప్పు తొలగించి వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సంఘటనస్థలాన్ని పరిశీలించారు.

also read:కరోనా దెబ్బ: మద్యం విక్రయాలు బంద్, వందల కోట్లు కోల్పోతున్న రాష్ట్రాలు

ఈ దుకాణంలో లాక్ డౌన్ కు ముందు ఉన్న స్టాక్ ఎంత, ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎంత అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు స్టాక్ ను పరిశీలిస్తున్నారు. మధ్యం కోసమే పైకప్పు తొలగించి లోపలకి దూరినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేశారు. మద్యానికి బానిసలుగా మారిన వారు మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడ చూస్తున్నాం. హైద్రాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో మద్యం దొరకక చికిత్సకు వస్తున్న కేసులు కూడ ఎక్కువగానే ఉన్నాయి. 

మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కూడ  లిక్కర్ అసోసియేషన్ కోరినా కూడ రాష్ట్రాలు అనుమతి ఇవ్వడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణలు మూతపడి రాష్ట్రాలు భారీగా రెవిన్యూను కోల్పోతున్నాయి.