రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తాం.. ఇంకా వారికి ఏం చేయాలనేది చర్చిస్తున్నాం.. : తెలంగాణ కాంగ్రెస్
Hyderabad: ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ వైఫల్యంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వక్రీకరించిందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ బుధవారం (జూలై 12న) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు కీలకమైన త్రీఫేజ్ విద్యుత్ ను 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా 8 గంటలు కూడా ఇవ్వలేదన్నారు.
Congress’ Telangana in-charge Manikrao Thakre: ఉచిత విద్యుత్ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త యుద్ధానికి తెరలేపింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య ఇదే విషయం గురించి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు పార్టీల శ్రేణులు నిరసనలు తెలుపుతూ.. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి అనీ, వారికి ఇంకా ఏమి ఇవ్వవచ్చో పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందనీ, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని ఖండించగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత, తెలంగాణలోని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా హైదరాబాదులో ఆందోళనలు నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉందన్నారు. మూడు పంటలకు 24×7 ఉచిత విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న దానికంటే ఎక్కువే కాంగ్రెస్ ఇస్తుందని, తెలంగాణకు తమ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఠాక్రే స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి ఇంకా ఏం ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. కరెంటు అయినా, ఇతర సంక్షేమ కార్యక్రమాలైనా కాంగ్రెస్ ఎప్పుడూ రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చిందనీ, తెలంగాణలో ఆ పని చేస్తుందన్నారు. కాగా, తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవడం లేదనీ, వారికి పంటల బీమా ప్రయోజనాలను నిలిపివేసిందని, రుణమాఫీ హామీని కూడా నెరవేర్చలేదని ఠాక్రే ఆరోపించారు. ఇక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ వైఫల్యంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వక్రీకరించిందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ బుధవారం (జూలై 12న) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు కీలకమైన త్రీఫేజ్ విద్యుత్ ను 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా 8 గంటలు కూడా ఇవ్వలేదన్నారు.