హైదరాబాద్:  ఎగ్జిబిషన్  సోసైటీ గురువారం నాడు కీలక నిర్ణయాలు తీసుకొంది. మరో 15 రోజుల పాటు ఎగ్జిబిషన్ ను కొనసాగించాలని  కూడ సోసైటీ పాలకవర్గం నిర్ణయం తీసుకొంది.

హైద్రాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్  సోసైటీ ప్రాంగణంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో  సుమారు 120 స్టాల్స్ దగ్ధమయ్యాయి. ఈ విషయమై స్టాల్స్ నిర్వాహకులకు భరోసా కల్పించే చర్యలను ఎగ్జిబిషన్  సోసైటీ తీసుకొంది.

గురువారం మధ్యాహ్నం ఎగ్జిబిషన్  సోసైటీ పాలక వర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ  సమావేశంలో  ఎగ్జిబిషన్  గ్రౌండ్స్‌లో దగ్దమైన  స్టాల్స్ పీజును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

మరో వైపు మరో 15 రోజుల పాటు  అదనంగా ఎగ్జిబిషన్ ను నిర్వహించాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు. వాస్తవానికి జనవరి 1వ తేదీ నుండి  ఫిబ్రవరి 15వ తేదీకి
ఎగ్జిబిషన్  పూర్తి కావాల్సి ఉంది. బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మరో 15 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. అంటే మార్చి 1వ తేదీ వరకు
ఎగ్జిబిషన్ కొనసాగించనున్నారు.

రెండు రోజుల పాటు అగ్నికి ఆహుతైన  ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను తిరిగి నిర్మించాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు.  అగ్నికి ఆహుతైన స్టాల్స్ యజమానులకు ప్రభుత్వం చెల్లించే పరిహారంతో పాటు ఎగ్జిబిషన్  సోసైటీ కూడ సగం పరిహారాన్ని చెల్లించాలని కూడ నిర్ణయం తీసుకొంది.