దొడ్డి కొమరయ్య జయంతి,వర్ధంతులు అధికారికంగా నిర్వహిస్తాం:కేటీఆర్
గొల్ల,కురుమలకు అండగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నవిషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్: దొడ్డి కొమరయ్య జయంతి,వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.హైద్రాబాద్ లోని మన్నెగూడలో బుధవారంనాడు నిర్వహించిన గొల్ల,కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత గొల్ల,కురుమల పరిస్థితి ఏమిటో ఆలోచించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్నిచేపట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు కేంద్రమంత్రి గిరిరాజ్ కూడా పశువుల అంబులెన్స్ పథకాన్ని ప్రశంసించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు.తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పథకాలను బీజేపీ పాలనలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు చేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.రాష్ట్రంలో చేపట్టిన చేప పిల్లల పెంపకాన్ని చూసి కర్ణాటక ప్రభుత్వం అబ్బురపడిందన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో మెంబర్లుగా ఉన్నారన్నారు. కానీ ఇవాళ ఈ సంఖ్య ఏడు లక్షల 61 వేలకు పెరిగిన పెరిగిందన్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోసే ఉద్దేశంతో తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు గొర్రెల పంపిణీని ప్రారంభించామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు రూ.11000 కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
తెలంగాణ పథకాలు బాగున్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్ సింగ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదన్నారు.
alsoread:నాంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్లకు చుక్కెదురు: ప్రచారాన్ని అడ్డుకున్నకాంగ్రెస్
గొల్ల కురుమ సోదరుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడ అమలు కావడం లేదని మంత్రి చెప్పారు.పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదన్నారు. తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటే దేశం కూడా బాగుంటుందనేది కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ చెప్పారు.గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరుకున్నారు.