Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డినుంచి పోటీచేస్తా.. కేసీఆర్ ను, కేటీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. రేవంత్ రెడ్డి..

అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను పోటీకి సిద్ధమేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ ను, కేటీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పుకొచ్చారు. 

We will defeat KCR and KTR , Revanth Reddy - bsb
Author
First Published Oct 26, 2023, 2:07 PM IST | Last Updated Oct 26, 2023, 2:07 PM IST

ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే దాన్ని తప్పక శిరసావాహిస్తానన్నారు. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క అయినా, నేనేనా… పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కులతో కలిసి మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసిఆర్ ను నేను ముందే ఆహ్వానించాను. ఆయన దానికి సిద్ధంగా లేరని  అర్థమవుతుంది. కొడంగల్ నుంచి పోటీకి కేసిఆర్ రాకపోతే కామారెడ్డిలో నేనే పోటీకి దిగుతాను.. కేసీఆర్, కేటీఆర్ లను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో హంగ్ రాదని. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఎప్పుడు హంగ్ ఏర్పడలేదని.. ప్రజలు అలాంటి అవకాశం ఇవ్వాలేదని.. తెలంగాణలో కూడా హాంగ్ ఎప్పుడు రాలేదని చెప్పుకొచ్చారు. మూడోవంతు మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం. టిఆర్ఎస్ నేతలు ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు .పార్టీ కార్యకర్తల్లా అధికారులు పనిచేసేలా బీఆర్ఎస్ చేస్తోంది. సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం. 

KTR: 'ఆ ఇష్యూపై నివేదిక వచ్చాకే మాట్లాడుతా.. కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయి'

రిటైర్ అయిన అధికారులకు పదవులు ఇస్తున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా ప్రైవేట్ ఆర్మీలా వాడుకుంటున్నారు. అందుకే విశ్రాంత అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా గత 7, 8 ఏళ్లుగా  కొందరు ఐఏఎస్లు కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. వీరిలో సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్లు కీలక శాఖలను నిర్వహిస్తూ, బీఆర్ఎస్ కు ఎన్నికల నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios