కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనంపై జరుగుతున్న ప్రచారంపై కోదండరామ్ తేల్చేశారు. ఈ విషయమై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామన్నారు.


హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ చెప్పారు.శెుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు జేఎసీ గా ఏర్పడాలని గతంలో తన వద్ద రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.కానీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా పేరు ప్రకటించిన తర్వాత టీజేఎస్ కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.ఈ ప్రచారాన్ని కోదండరామ్ కొట్టిపారేశారు. ఇందులో వాస్తవం లేదన్నారు. తెలంగాణ నీటిని అక్రమంగా తీసుకెళ్తున్న జగన్ ను షర్మిల ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. టీజేఎస్ చీప్ కోదండరామ్ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసి