డబుల్ ఇంజన్ గ్రోత్ అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎండగట్టారు. యూపీ రాష్ట్రంలో బీజేపీ పాలనలో అభివృద్దిని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
హైదరాబాద్: Ukraineనుండి రాస్ట్రానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు MBBS అభ్యసించేందుకు అవసరమైన ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ సీఎం KCR ప్రకటించారు.
Telangana Assembly Budget సమావేశాల చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ చర్చను ప్రారంభించారు. ఆ తర్వాత CLP నేత ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు
ఉక్రెయిన్ లో వైద్య విద్యను చదివేందుకు మన దేశం నుండి సుమారు 20 వేల మంది Students వెళ్లారన్నారు. మన దేశంలో వైద్య విద్య చదవడానికి కోటి రూపాయాలు ఖర్చు పెట్టాల్సి వస్తే.. ఉక్రెయిన్ లో మాత్రం రూ. 25 నుండి రూ. 30 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి అవుతుందన్నారు. ఉక్రెయిన్ పై Russia మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో రాష్ట్రానికి ఉక్రెయిన్ నుండి 740 మంది వైద్య విద్యార్ధులు తిరిగి వచ్చారన్నారు. ఆ వైద్య విద్యార్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ 740 మంది వైద్య విద్యార్ధులు వైద్య విద్యను చదువుకొనే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.ఉక్రెయిన్ లో Karnataka రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్ధి మరణిస్తే కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి: కేసీఆర్
ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సెర్ప్ లో పనిచేసే 4 వేల మంది పనిచేస్తున్నారని వారికి ప్రభుత్వ ఉద్యోగులతో కూడా సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. చిన్న ఉద్యోగులకు కూడా 30 శాతం పై హైక్ ఇచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
డబుల్ ఇంజన్ గ్రోత్ పై కేసీఆర్ సెటైర్లు
కేంద్రంలో , రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అది డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. double engine growthఅనేది చాలా ఛండాలమైన నినాదమన్నారు.డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ అంటూ కేసీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ అభివృద్దిని సాధించిందన్నారు.
111 జీవో ఎత్తివేస్తాం: కేసీఆర్
111 జీవో కింద లక్షా 32 వేల 600 ఎకరాల భూమి ఉందన్నారు. 111 జీవోను త్వరలోనే ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.111 జీవో అర్ధరహితమన్నారు.111 జీవో కింద 83 మండలాలున్నాయన్నారు. దేవస్తానం భూమి గజం కూడా అన్యాక్రాంతం కావొద్దన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు కలుషితం కాకుండా నిబంధన పెట్టారన్నారు. ఈ నీటిని ఎవరూ వాడడం లేదన్నారు.
హైద్రాబాద్ కు మంచినీళ్లు ఇచ్చేందుకు కృష్ణా, గోదావరి జలాలను ఇస్తామన్నారు. హైద్రాబాద్ కు మరో 100 ఏళ్ల వరకు మంచి నీటి సమస్య ఉండదన్నారు. దీంతో 111 జీవోను ఎత్తివేస్తామని కేసీఆర్ తెలిపారు.
