కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో ఎన్నికలకు :బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

రెండు రోజుల పాటు జరిగిన  విస్తారక్ ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.  తెలంగాణలో  90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు సాధించే వ్యూహంతో  ముందుకు  వెళ్తున్నామని లక్ష్మణ్ వివరించారు. 

We planning to win  90 Assembly segments  in 2023 Telangana Elections: BJP MP laxman

హైదరాబాద్:  కేసీఆర్ హటావో  తెలంగాణ బచావో పేరుతో ప్రజల్లోకి  వెళ్తామని  బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో   90అసెంబ్లీ, లక్ష్యంగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టుగా  డాక్టర్  లక్ష్మణ్ తెలిపారు.  శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని  ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది  ఏప్రిల్ నెలలో అమిత్ షా లేదా, జేపీ నడ్టా తో  తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా  ఆయన చెప్పారు. ఈ  బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తాంమని ఆయన ప్రకటించారు.

ప్రతి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగరు అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించినట్టుగా ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా  గతంలో గెలవని 160పార్లమెంట్ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. రానున్న నెల రోజుల్లో గ్రామ స్థాయిలో పది వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్  నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

also read:టార్గెట్ 90 సీట్లు: తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు పాలక్‌ లను నియమించిన బీజేపీ

జనవరి 20నుంచి ప్రజా‌ గోస.‌.‌ బీజేపీ భ రోసా కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామని డాక్టర్ లక్ష్మణ్ వివరించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటుందన్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు.  పంచాయతీలకు  కేంద్రం  ఇస్తోన్న నిధులను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ సర్పంచ్ లే చెబుతున్నారన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలవటం బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. తన‌ మాతృమూర్తి హీరా బెన్ పెంపకంతోనే మోదీ కర్మయోగీగా మారారన్నారు. బాల్యంలో తన తల్లి కష్టాలు చూసి మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన గొప్ప నేత మోడీ అని ఆయన కొనియాడారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios