Asianet News TeluguAsianet News Telugu

రాత్రికి రాత్రే పదవులు మా సార్టీలో పదవులు రావు: బీజేపీ నేత జితేందర్ రెడ్డి

రాత్రికిరాత్రే  తమ పార్టీలో  పదవులు  రావని  బీజేపీ నేత  జితేందర్ రెడ్డి చెప్పారు.  తమ పార్టీలో  గందరగోళం సృష్టించేందుకు  కేసీఆర్ లీకులు  ఇస్తున్నారన్నారు.

We Discussed on Strengthening BJP in Telangana Says Jithender Reddy  lns
Author
First Published Jun 11, 2023, 3:46 PM IST | Last Updated Jun 11, 2023, 4:02 PM IST

హైదరాబాద్: తమ పార్టీలో  గందరగోళం  సృష్టించేందుకు   కేసీఆర్  రోజుకో లీకులు  ఇస్తున్నారని  బీజేపీ నేత, మాజీ ఎంపీ  జితేందర్ రెడ్డి  విమర్శించారు. ఆదివారంనాడు బీజేపీ  నేత  జితేందర్ రెడ్డి  నివాసలంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశం  మగిసిన తర్వాత  జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ను  దెబ్బకొట్టేది  బీజేపీయేనని  కేసీఆర్ తెలుసునన్నారు. అందుకే తమ పార్టీ క్యాడర్ లో గందరగోళం సృష్టించేందుకు గాను  కేసీఆర్  లీకులిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో  మాదిరిగా తమ పార్టీలో  రాత్రికి రాత్రే పదవులు  ఇచ్చే పరిస్థితి ఉండన్నారు.   మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు  బీజేపీ  ప్రచార కమిటీ చైర్మెన్ పదవిని  ఇచ్చారని మీడియాలో  జరిగిన ప్రచారంపై ఆయన  స్పందించారు.  పార్టీలో  ఎవరికైనా పదవులు  కట్టబెట్టే సమయంలో  అందిరితో  నాయకత్వం  చర్చిస్తుందన్నారు. 

also read:జితేందర్ రెడ్డి ఇంటికి కొండా, రాములమ్మ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..?

 సిద్దాంతం, క్రమశిక్షణ గల పార్టీ బీజేపీయని  ఆయన గుర్తు  చేశారు. బీజేపీలో  ప్రచార కమిటీ  అనే పదవే లేదని  జితేందర్ రెడ్డి గుర్తు  చేశారు. కాంగ్రెస్ పార్టీలో  ఈ పదవి ఉందన్నారు. పార్టీకి సంబంధించిన   ఏ నిర్ణయమైనా  ఢిల్లీలోనే  జరుగుతుందని  ఆయన  చెప్పారు.  తమ పార్టీలో  ఎలాంటి అసంతృప్తి లేదని  జితేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. తన నివాసంలో  పార్టీ నేతలు  క్యాజువల్ గా సమావేశమయ్యామన్నారు.

కానీ  ఈ సమావేశాన్ని మీడియా సీరియస్ మీటింగ్ గా  చిత్రీకరించిందన్నారు.  తమది కార్యకర్తల పార్టీగా  ఆయన  చెప్పారు. తప్పుడు  వార్తలు  ఇవ్వవద్దని  ఆయన మీడియాను  కోరారు.  బీజేపీ బలోపేతంపై  చర్చించామన్నారు.తమ సమావేశం  వెనుక రహస్య ఎజెండా లేదని జితేందర్ రెడ్డి  చెప్పారు.  పదవులకు ముందే లీకుల  సంస్కృతి బీజేపీలో  లేదన్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్  బండి సంజయ్ ను  మారుస్తున్నారని  కేసీఆర్   ప్రచారం చేయిస్తున్నారన్నారు. జూపల్లి కృష్ణారావు,  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలు  బీజేపీలో  చేరాలని ఆయన  కోరారు.

బీజేపీ నేత  ఏపీ జితేందర్ రెడ్డి  నివాసంలో  ఇవాళ  పలువురు బీజేపీ నేతలు సమావేశమయ్యారు.   కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  విజయశాంతి, విజయరామరావు, బూర నర్సయ్య గౌడ్, విఠల్  తదితరులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.  బీజేపీలో  చోటు  చేసుకున్న పరిణామాలపై   చర్చించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios