Asianet News TeluguAsianet News Telugu

పబ్‌లలో ఆకస్మిక దాడులు: మాదాపూర్ డీసీపీ కె. శిల్పవల్లి

పబ్ లలో ఆకస్మికంగా దాడులు చేస్తామని మాదాపూర్ డీసీపీ కె. శిల్పవల్లి చెప్పారు. పబ్ లలో మైనర్లకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. 

We  Continuously raids on pubs:Madhapur DCP K. Shilpavalli
Author
Hyderabad, First Published Jun 10, 2022, 12:28 PM IST | Last Updated Jun 10, 2022, 12:42 PM IST

హైదరాబాద్:  PUB లలో ఆకస్మికంగా దాడులు చేస్తామని Madhapur డీసీపీ K. Shilpavalli  చెప్పారు. శుక్రవారం నాడు ఆమె ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.పబ్ లలో minorsను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని DCP  చెప్పారు. గెట్ టూ గెదర్ ఫ్యామిలీ పార్టీల పేరుతో పబ్ లలోకి మైనర్లను అనుమతించమని డీపీసీ తెలిపారు. పబ్ లలో ఏ పార్టీ జరిగినా మైనర్లకు అనుమతి లేదని డీపీసీ శిల్పవల్లి తెలిపారు.

పబ్ లలోకి వచ్చే మహిళలను మహిళా సెక్యూరిటీ లేదా మహిళా బౌన్సర్లతో తనిఖీ చేయించాలని డీసీపీ చెప్పారు. నిర్దేశిత సమయంలోనే పబ్ లను మూసివేయాలని డీసీపీ చెప్పారు. పబ్ ల్లో జరిగే పార్టీలన్నీ ఇన్ స్టా గ్రామ్ లలో పోస్టు చేస్తున్నారని డీసీపీ చెప్పారు.  ఇన్ స్టా పోస్టులు అమ్మాయిలకు ఆకర్షితులౌతున్నారన్నారు. .అమ్మాయిలను ఆకర్షించేందుకు ఇన్ స్టా ను వాడుతున్నారని ఆమె చెప్పారు.  ఇన్ స్టా పోస్టుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.

also read:జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: ఆధారాల సేకరణలో పోలీసులు.. నిందితుల దుస్తులు, మొబైల్స్ స్వాధీనం

హైద్రాబాద్ లలోని పబ్ లలో  డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పబ్ లపై కేసులు కూడా నమోదయ్యాయి.  తాజాగా అమ్నేషియా పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.  ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios