Asianet News TeluguAsianet News Telugu

ఆపదలో ఉన్నవారి చెంతకు ఐదు నిమిషాల్లోనే : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందుకు పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

We are reaching within five minutes to victims: Telangana Dgp Mahender Reddy
Author
Hyderabad, First Published Dec 31, 2021, 12:53 PM IST

హైదరాబాద్:  రాష్ట్రంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందుకు పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పట్టణాల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందకు 5 నిమిషాల సమయం పడితే గ్రామీణ ప్రాంతాల్లో వారిని ఆదుకొనేందుకు ఏడు నిమిషాల సమయం పట్టిందని Telangana డీజీపీ Mahender Reddy చెప్పారు.

తెలంగాణ పోలీస్ శాఖ 2021 వార్షిక నేర నివేదికను డీజీపీ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చామన్నారు. ఈ ఏడాది షీ టీమ్స్ కూడా సమర్ధవంతంగా పనిచేశాయని ఆయన కితాబిచ్చారు. ఈ ఏడాది 5145 మంది మహిళా బాధితులకు న్యాయం చేసినట్టుగా డీజీపీ తెలిపారు.  ఈ ఏడాది రాష్ట్రంలో రూ.877  కోట్ల చలాన్లు విధించామని కూడా డీజీపీ చెప్పారు. 

also read:న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు: తెలంగాణ డీజీపీ

Corona సమయంలో పోలీస్ అధికారులు సమర్ధవంతంగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు అన్ని శాఖలను సమన్వయం చేసుకొంటూ ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా పోలీస్ శాఖ పనిచేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై  ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. .రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసిందన్నారు. అన్ని రకాల కేసుల్లో దోషులకు శిక్ష పడేలా పోలీస్ వ్యవస్థ కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు.  ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందుకు  టెక్నాలజీని ఉపయోగించుకొన్నామని డీజీపీ చెప్పారు.

ఈ ఏడాది ఎక్కడా కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. భైంసాలో చిన్న ఘటనలు తప్ప ఎక్కాడా కూడా మేజర్ ఇష్యూ చోటు చేసుకోలేదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సఫలీకృతమైందని మహేందర్ రెడ్డి చెప్పారు.  రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ తెలిపారు. మావోయిస్టుల రాకపోకలను నియంత్రించడంలో సమర్ధవంతంగా పనిచేశామన్నారు. 98 మావోయిస్టులను అరెస్ట్ చేస్తే, 133 మంది లొంగిపోయారని డీజపీ చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 4.65 శాతం పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి  తెలిపారు.

 గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 4.65 శాతం పెరిగాయని డీజీపీ  తెలిపారు. నేరగాళ్లకు శిక్ష పడిన కేసులు 50.3 శాతంగా ఉన్నాయన్నారు. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించేందుకు సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించామన్నారు. డయల్ 100కి ఈ ఏడాది 11.24 లక్షల మంది ఫిర్యాదులు చేశారని డీజీపీ చెప్పారు.800 పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తరచుగా నేరాలకు పాల్పడే 664 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 8828 కేసులు నమోదయ్యాయన్నారు.రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6690 మంది చనిపోయారని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.879 కోట్ల జరిమానాను విధించామని డీజీపీ తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios