త్వరలో 10 జిల్లాలో భారీ బహిరంగ సభలు: బండి సంజయ్

రాష్ట్రంలో  వచ్చే  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ పార్టీ అగ్ర నేతలతో  చర్చించిట్టుగా  తెలంగాణ బీజేపీ నేతలు  చెప్పారు.  

We  are preparing  for Telangana Assembly Elections 2023:  BJP Telangana President Bandi Sanjay


హైదరాబాద్:తెలంగాణలో  మార్పు  జరగాలని  ప్రజలు కోరుకుంటుున్నారని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  చెప్పారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు  మంగళవారంనాడు బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో  న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత   బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం  సంతృప్తిని వ్యక్తం  చేసిందన్నారు.ఎన్నికలు  ఎప్పుడూ  వచ్చినా  కూడా  తాము సిద్దంగా  ఉన్నామని  బండి సంజయ్ ప్రకటించారు.  రాష్గ్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ప్రజా గోస కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా  ఆయన  చెప్పారు.  రాష్ట్రంలో  త్వరలోనే 10 జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బండి సంజయ్  తెలిపారు. ఈ సభలకు  మోడీని  ఆహ్వనించాలని నిర్ణయించినట్టుగా సంజయ్ తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో  ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై  కూడా  చర్చించినట్టుగా  బండి సంజయ్ చెప్పారు.  

 బీఆర్ఎస్ కు బీజేపీ  మాత్రమేనని  ప్రజలు భావిస్తున్నారని  బండి సంజయ్ తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్  ఫలితాలే  ప్రజల ఆలోచనలకు  నిదర్శనమని  బండి సంజయ్  అభిప్రాయపడ్డారు.

గత ఎన్నికల్లో  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ  చేసిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు  చేశారు. తమకు నాయకులు లేకపోతే  గత ఎన్నికల్లో  119 స్థానాల్లో  అభ్యర్ధులను నిలుపుతామని  బడి సంజయ్ ప్రశ్నించారు.  

రానున్న ఎన్నికల్లో కూడా  తమ పార్టీ  తరపున  119 మంది  అభ్యర్ధులు ఎలా పోటీ చేశారని  ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు  తమపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి  సంజయ్ మండిపడ్డారు.

 రెండు ఎంపీ సీట్లున్న బీజేపీ  దేశంలో  అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఆయన పార్టీకి  ఒక్క ఎమ్మెల్యే కూడా లేడనే విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. ఇవాళ  బీజేపీకి  300 ఎంపీలున్నారని సంజయ్ చెప్పారు. 

రానున్న రోజుల్లో  ఏం చేయాలనే దానిపై  కూడా రాష్ట్ర నేతల  నుండి సూచనలు, సలహలను  పార్టీ నేతలు  తీసుకున్నారని ఆయన  చెప్పారు. ఇవాళ జరిగిన సమావేశం  రొటీన్ సమావేశంగా  ఆయన పేర్కొన్నారు. 

also read:అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ: భవిష్యత్తు వ్యూహంపై చర్చ

ఢిల్లీ లిక్కర్  స్కాం విషయంలో  ఆదారాల ప్రకారంగా  దర్యాప్తు  సంస్థలు  చర్యలు తీసుకుంటుందని  బండి సంజయ్  చెప్పారు.  ఇవాళ జరిగిన సమావేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం  గురించి  చర్చించలేదన్నారు.   ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టైన  మనీష్ సిసోడియా  విషయంలో  కేసీఆర్ స్పందించడాన్ని ఆయన ప్రస్తావించారు.   ఇదే కేసులో  కవిత పేరు కూడా చార్జీషీట్లలో  వచ్చిన విషయాన్ని బండి సంజయ్  గుర్తు  చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios