వరంగల్: ప్రజలు మార్పులు కోరుకొంటున్నారు.. అందుకే తాము అన్ని చోట్ల విజయం సాధిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు వరంగల్ లో  భద్రకాళి అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.రాజకీయ పార్టీల మాయలో రైతులు పడొద్దని ఆయన సూచించారు. 

వరంగల్ కార్పోరేషన్ గెలుపుకోసం గట్టిగా పనిచేస్తామని ఆయన చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల నుండి 40కిపైగా కార్పోరేటర్ స్థానాలను కైవసం  చేసుకోవడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపింది.

2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి  అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు గాను కమల దళం వ్యూహాలను రచిస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో రానున్న ఎన్నికలపై కూడ బీజేపీ కన్నేసింది.  ఇతర పార్టీాలకు చెందిన అసంతృప్తులకు కూడ బీజేపీ గాలం వేస్తోంది. త్వరలోనే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.