కొండా దంపతులు రాజకీయాలకు పనికిరారని, వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ప్రజలను నాలుగున్నర సంవత్సరాలుగా బెదిరించారని ఆరోపించారు. 

కొండా దంపతులపై వరంగల్ నగర మేయర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్‌ తూర్పు ప్రజల ఆత్మాభిమానం దెబ్బ తీసే విధంగా కొండా దంపతులు వ్యవహరించారని మండిపడ్డారు. వరంగల్ లోని వైశ్యభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కొండా దంపతులపై విరుచుకుపడ్డారు. 

కొండా మురళి పెద్ద ఊసరవెళ్లి అని, ఎన్ని రంగులైన మార్చగలుగుతాడని విమర్శించారు. అన్నదమ్ములు, కార్యకర్తలు, నాయకులు, కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టి వివాదాలు సృష్టించాడని ఆరోపించారు. కొండా దంపతులు రాజకీయాలకు పనికిరారని, వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ప్రజలను నాలుగున్నర సంవత్సరాలుగా బెదిరించారని ఆరోపించారు. తూర్పు ప్రజల గౌరవాన్ని నిలబెట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కొండా మురళి తూర్పు నాయకులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని నరేందర్‌ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో స్థానిక అభ్యర్థికే కేసీఆర్‌ టికెట్‌ ఇస్తారని, ఎవరికి ఇచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. బూత్‌ స్థాయిలో కార్యకర్తలు సైనికుల వల్లె పనిచేసి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు.