పాలకుర్తిలో కాదు...ఎర్రబెల్లి కొండా సురేఖపై పోటీ చేయాలి: అక్కడి నుండి నేను..: రవీందర్ రావు

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 15, Sep 2018, 4:04 PM IST
warangal trs president ravinder rao fires on errabelli dayakar rao
Highlights

టీఆర్ఎస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 105 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనే పార్టీలో కలకలం రేపింది. అప్పటివరకు తమకు సీటు వస్తుందని భావించిన నాయకులు కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో తమ పేరు లేకపోయేసరికి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగా బైటపెట్టారు. ఇలా ప్రస్తుతం వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ సీటును ఎర్రబెల్లి దయాకరరావుకి ఇవ్వడంపై కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు తనకు పాలకుర్తి సీటు వస్తుందని ఆశించాడు. అయితే పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఎర్రబెల్లి దయాకరరావుకే మళ్లీ అవకాశం కల్పించింది. దీంతో అతడు ఎర్రబెల్లికి వ్యతిరేకంగా రాజకీయాలు ప్రారంభించాడు. ఎర్రబెల్లికి దమ్ముంటే కొండా సురేఖపై వరంగల్ తూర్పులో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అంతేకాని పాలకుర్తిలో పోటీచేయడం ఏంటని రవీందర్ రావు ప్రశ్నించారు.

స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరుతున్నారని...అందువల్లే తనకు టికెట్ కావాలని అదిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. ఇప్పటికైనా తనకు పాలకుర్తి టికెట్ కేటాయించాలని రవీందర రావు కోరారు. లేకుంటే కార్యకర్తల కోరిక మేరకు నిర్నయాలు తీసుకుంటానని హెచ్చరించారు.

loader