వరంగల్ జిల్లాలో ముగ్గురి హత్య: పోలీసుల అదుపులో షఫీ సహా ఆరుగురు

వరంగల్ జిల్లాలో ముగ్గురి హత్య కేసులో  షఫీ సహా మరో ఆరుగురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆరుగురిరి అరెస్ట్ చేశారు.

Warangal police detained six persons for killing three


వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నాడు తెల్లవారుజామున  సోదరుడి కుటుంబంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో షఫీ సహా అతనికి సహకరించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నర్సంపేటకు చెందిన గొర్రెల కాపరి వెంకన్న, రూపిరెడ్డిపల్లెకు చెందిన విజేందర్, లారీ డ్రైవర్ ఎండీ పాషా, ఉర్సుగుట్టకు చెందిన మీర్జా ఇక్బాల్, సాధిక్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షఫీ  సెల్‌ఫోన్  సిగ్నల్ ఆధారంగా పోలీసులు  వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వ్యాపారంలో విబేధాల కారణంగానే సోదరుడి కుటుంబంపై షఫీ దాడి చేశాడు.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.మరో ఇద్దరు గాయపడ్డారు.

తనకు ఆస్తులు ఇవ్వాలని షఫీ తన సోదరుడిపై గొడవకు దిగినట్టుగా మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.  బుధవారం నాడు తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులగొట్టి సోదరుడు ఆయన భార్య మరొకరిని దారుణంగా హత్య చేశారు.  మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పశువుల వ్యాపారంలో తలెత్తిన ఆర్ధిక లావాదేవీలతోనే అన్న చాంద్ బాషా కుటుంబంపై తమ్మడు షఫీ దాడి చేశాడని వరంగల్ పోలీసులు తెలిపారు.  చాంద్ బాషా ఆయన భార్య సబీరా బేగం, చాంద్ బాషా బావమరిది ఖలీల్ మృతి చెందగా, చాంద్ బాషా ఇద్దరు కొడుకులు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios