హైదరాబాద్: వరంగల్‌లో ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న రవళి చివరికి ఓడిపోయింది. సికింద్రాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. హన్మకొండలోని వాగ్ధేవి డిగ్రీ కళాశాలలో తోపుచర్ల రవళి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అదే కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి అన్వేష్ ఫిబ్రవరి 27న పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  

అందరూ చూస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించిన సాయి అన్వేష్ మంటలు ఆర్పేందుకు ఎవరినీ ముందుకు రాకుండా ఉండేందుకు నానా హంగామా చేశాడు. 80శాతం కాలిపోవడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. స్థానికులు రవళిని సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. 

వారంరోజులపాటు ఐసీయూలో రవళికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్న రవళి పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు బోరున విలపిస్తున్నారు. నిందితుడు సాయి అన్వేష్ కు ఉరిశిక్ష వెయ్యాలంటూ డిమాండ్ చేశారు. 

రవళిని అన్వేష్ గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అన్వేష్ ప్రేమను రవళి తిరస్కరించడంతో ఫిబ్రవరి 27న దాడికి పాల్పడ్డాడు. కాలేజీ హాస్టల్ సమీపింలో రవళిని అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం నిందితుడు అన్వేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.