వరంగల్ ఎంజీఎంలో మళ్లీ ఎలుకల కలకలం: శానిటేషన్ సిబ్బందిపై సూపరింటెండ్ ఆగ్రహం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఎలుకలు కలకలం రేపుతున్నాయి. ఆయా వార్డుల్లో ఎలుకలను పట్టుకొనేందుకు బోన్లు, ర్యాట్ కిట్స్ ఏర్పాటు చేయాలని సూపరింటెండ్ ఆదేశించారు.
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఎలుకలు కలకలం రేపుతున్నాయి. వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.శానిటేషన్ సిబ్బందిపై ఎంజీఎం సూపరింటెండ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండ్ ఆదేశించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని శానిటేషన్ కాంట్రాక్టర్ ను ఆమె కోరారు. ఎలుకలు తిరుగుతున్న వార్డుల్లో ఎలుకల బోన్లను ఏర్పాటు చేయాలని సూపరింటెండ్ ఆదేశించారు సూపరింటెండ్ ఆదేశాలతో ర్యాటి కిట్స్, బోన్లను ఏర్పాటు చేసి ఎలుకలను పట్టేందుకు శానిటేషన్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
గతంలో ఎంజీఎం ఆసుపత్రిలోని పలు వార్డుల్లో ఎలుకల వ్యవహరంపై ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. గతంలో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు గాయపర్చాయి.ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది..ఎలుకలు గాయపర్చిన రోగిని చికిత్స కోసం హైద్రాబాద్ కు తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండ్ పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొంది.