Asianet News TeluguAsianet News Telugu

క‌మ‌ల‌దళానికి షాక్.. రాత్రి దాకా బీజేపీలో ప‌ని చేసి.. తెల్లారి టీఆర్ఎస్ లో చేరిన వరంగ‌ల్ లీడ‌ర్లు

వరంగల్ కు చెందిన ఇద్దరు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. వారిద్దరూ ఏబీవీపీ నుంచి పార్టీలో వారి ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే వారు రాత్రి వరకు బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 

 

Warangal leaders joined TRS after working till night in BJP..
Author
Hyderabad, First Published Jul 2, 2022, 11:38 AM IST

హైద‌రాబాద్ లో బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఘ‌నంగా నిర్వ‌హించుకుంటుకున్న స‌మ‌యంలో ఆ పార్టీకి కొంద‌రు లీడ‌ర్లు హ్యాండ్ ఇచ్చారు. వరంగ‌ల్ కు చెందిన ఇద్ద‌రు లీడ‌ర్లు బీజేపీ స‌మావేశం కోసం అన్నీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. సాయంత్రం వ‌ర‌కు జాతీయ నేతల‌కు వెల్ క‌మ్ చెప్పిన వారు.. తెల్ల‌వార‌గానే గులాబి వ‌నానికి చేరుకున్నారు. రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆ ప‌రిణామం ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. 

మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బాల్యన్‌కు అవమానం.. గంటపాటు గెస్ట్ హౌస్ బయటే ఎదురుచూపులు..!

వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు చెందిన ఇద్ద‌రు బీజేపీ లీడ‌ర్లు టీఆర్ఎస్ లో శుక్ర‌వారం చేరారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో వారిద్ద‌రూ గులాబీ కండువా క‌ప్పుకున్నారు. బీజేపీ త‌ర‌ఫున గెలిచిన చింతాకుల అనిల్, మ‌రో సీనియ‌ర్ లీడ‌ర్ సునీల్ టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వీరిద్ద‌రూ ఇంత స‌డెన్ గా అధికార పార్టీలో చేర‌డానికి స్థానిక శాస‌న స‌భ్యుడు నన్నపునేని నరేందర్ కార‌ణంగా తెలుస్తోంది. అయితే వీర‌ద్దరూ బీజేపీని వీడ‌టం ఆ పార్టీకి కొంచెం ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంది. ఈ లీడ‌ర్లిద్ద‌రీ ప్ర‌స్తానం ఏబీవీపీ నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డ యాక్టివ్ గా ప‌ని చేస్తు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ క‌మ్రంలో అనిల్ గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్ గా విజ‌యం సాధించారు. సునీల్ కూడా జిల్లాలో పార్టీ ప‌ద‌వులు చేప‌ట్టారు.

హెచ్‌ఐసీసీలో బీజేపీ పదాధికారులు సమావేశం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో భేటీ..

హైద‌రాబాద్ లో జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల నేప‌థ్యంలో జాతీయ నేత‌లు జిల్లాల‌కు చేరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వ‌రంగ‌ల్ స‌మావేశం నిర్వ‌హించేందుకు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నేత ర‌విశంకర్ ప్ర‌సాద్ జిల్లాకు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఈ ఇద్ద‌రు నాయ‌కులు వెల్ క‌మ్ చెప్పారు. పార్టీ ఆఫీసులో జ‌రిగిన మీటింగ్ లో జాతీయ నేత‌తోనే ఉన్నారు. నైట్ వ‌ర‌కు పార్టీ కార్య‌క‌లాపాల్లో యాక్టివ్ గా ఉన్న నేత‌లు..తెల్లవారేస‌రికి మన‌సు మార్చుకున్నారు. శుక్ర‌వారం పొద్దున టీఆర్ఎస్ లీడ‌ర్ల‌తో హైద‌రాబాద్ క‌నిపించారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios