మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర  మంత్రి  Sanjeev Kumar Balyanకు అవమానం ఎదురైంది. మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ గంటపాటు తాను బస చేయాల్సిన గెస్ట్ హౌస్ బయటే ఎదురుచూడాల్సి వచ్చింది. 

మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి Sanjeev Kumar Balyan‌కు అవమానం ఎదురైంది. మెదక్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ బస కోసం ఓ గెస్ట్ హౌస్ బుక్ చేశారు. నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బాల్యన్.. రాత్రి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అయితే గెస్ట్ బుక్ చేసిన అక్కడివారు తాళాలు ఇవ్వలేదు. దీంతో గంటపాటు కేంద్ర మంత్రి బాల్యన్ గెస్ట్ హౌస్ బయటే వేచిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో గెస్ట్ హౌస్ తాళాలు పగలగొట్టారు. ఈ మేరకు తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేశాయి. 

ఇక, బీజేపీ చేపట్టిన తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా మెదక్ జిల్లో సంజీవ్ కుమార్ బాల్యన్ పర్యటించారు. మెదక్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో ఆయన పర్యటించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుంది.. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. ఇక, మెదక్‌లో మత్య్సకారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రతి మత్స్యకారుడికి కిసాన్ క్రెడిట్ కార్డు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు.