గో బ్యాక్ నిజామాబాద్: మధు యాష్కీకి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో పోస్టర్లు

గాంధీ భవన్ లో  కాంగ్రెస్ నేత  మధు యాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.  గో బ్యాక్  నిజామాబాద్ అంటూ మధు యాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లలో ఉంది.

Wall posters  Against  Madhu Yashki at  Gandhi Bhavan in Hyderabad lns

హైదరాబాద్: గాంధీ భవన్ లో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కీకి వ్యతిరేకంగా  పోస్టర్లు వెలిశాయి.  సేవ్ ఎల్ బీ నగర్ కాంగ్రెస్ అంటూ  ఆ పోస్టర్లలో ఉంది. గో బ్యాక్ నిజామాబాద్ అంటూ మధు యాష్కీని ఉద్దేశించి  రాసి ఉంది.  

వచ్చే ఎన్నికల్లో ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  మధు యాష్కీ  పోటీ చేసేందుకు  రంగం సిద్దం  చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే  ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ టిక్కెట్టు కోసం  మధు యాష్కీ  ధరఖాస్తు  చేసుకున్నారు.  ఈ తరుణంలో  మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం  కలకలం రేపుతుంది.

2004, 2009  పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  మధు యాష్కీ విజయం సాధించారు.  2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి  మరోసారి బరిలోకి దిగారు. అయితే  బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో  మధు యాష్కీ ఓటమి పాలయ్యారు.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో మధు యాష్కీ  అయిష్టంగానే బరిలోకి దిగాడు.  ఈ ఎన్నికల్లో  నామమాత్రంగా  ప్రచారం చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి  ధర్మపురి అరవింద్  విజయం సాధించారు.  అయితే  వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుండి పోటీకి దూరంగా ఉండాలని  మధు యాష్కీ  నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే  ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.గత నెల  18వ తేదీ నుండి  25వ తేదీ వరకు  కాంగ్రెస్ టిక్కెట్ల కోసం  కాంగ్రెస్ పార్టీ  ధరఖాస్తులను ఆహ్వానించింది.ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం  మధు యాష్కీ  ధరఖాస్తు  చేసుకున్నారు.

also read:నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

అయితే  సేవ్ ఎల్ బీ నగర్ కాంగ్రెస్ అంటూ  వెలిసిన పోస్టర్లపై  మధు యాష్కీ  కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గాంధీ భవన్ లో  తనకు వ్యతిరేకంగా  వెలిసిన పోస్టర్ల వెనుక   అధికార బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆయన  ఆరోపించారు.2018  అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో  సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో చేరారు.  దీంతో  ఎల్ బీ నగర్ నుండి  మధు  యాష్కీ  ధరఖాస్తు చేసుకున్నారు.  అయితే ఎల్ బీ నగర్ టిక్కెట్టును  జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులే ఈ పనిచేశారనే  మధు యాష్కీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని  యాష్కీ వర్గీయులు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios