కీలకమైన ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ రోజు నిర్వహించే లోక్ సభ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

దొంగ ఓట్లు ఏరివేతలో కీల‌క పాత్ర పోషించే ఓట‌రు జాబితాకు ఆధార్ కార్డు లింక్ ప్ర‌క్రియకు సంబంధించిన బిల్ నేడు లోక్ స‌భ ముందుకు రానుంది. ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం సూచించిన ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఆ సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన బిల్లును ఈ శీతాకాల స‌మావేశాల్లోనే పార్ల‌మెంట్‌లో ఆమోదించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈరోజు జ‌రిగే లోక్ స‌భ స‌మావేశాల్లోనే ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ బిల్లుకు లోక్ స‌భ సునాయాసంగా ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. ఈ బిల్లుకు రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన త‌రువాత రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం పంపించ‌నున్నారు. ఇదే జ‌రిగితే ఎన్నిక‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరగ‌నుంది. 

ఇక నుంచి నాలుగు సార్లు ఓట‌రు న‌మోదు...
ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింతే ఇక ఏడాదిలో నాలుగు సార్లు ఓట‌రు న‌మోదు చేసుకోవ‌డానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం అవ‌కాశం ఇవ్వ‌నుంది. ప్ర‌స్తుతం ఏడాదికి ఒకే సారి కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఇది ఇప్పుడు మారనుంది. ప్ర‌తీ ఏటా ఎన్నిల సంఘం జ‌న‌వ‌రి నెల‌లో ఓటరు నమోదు కార్య‌క్ర‌మాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంటుంది. ప్ర‌తీ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీని క‌టాఫ్‌గా నిర్ణ‌యిస్తుంది. జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 18 సంవ‌త్స‌రాలు నిండిన వారంద‌రినీ అర్హులుగా గుర్తించి వారికి ఓట‌రు కార్డులు జారీ చేస్తుంది. ప్ర‌తీ గ్రామంలో ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ కొత్తగా ఓట‌రు న‌మోదు చేస్తుంటారు. డిగ్రీ కాలేజెస్‌, ఇత‌ర ఇంజనీరింగ్ కాలేజ్ లలో ఎన్నిక‌ల సంఘం అధికారులు క్యాంపులు పెట్టి మ‌రీ ఓట‌రు న‌మోదు జ‌రుపుతుంటారు. అయితే ఈ ప‌ద్దతి వ‌ల్ల చాలా మంది యువ‌త కొత్త‌గా ఓటు హ‌క్కు పొంద‌లేక‌పోతున్నారు. 
జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ క‌టాఫ్ గా నిర్ణ‌యించ‌డం వ‌ల్ల అదే నెల‌లో 18 ఏళ్లు నిండే యువ‌త‌కు ఓట‌రు కార్డులు ల‌భించ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌న‌వ‌రి 2వ తేదీన 18 ఏళ్లు నిండిన యువ‌కుడికి, ఫిబ్ర‌వ‌రి నెల‌లో 18 ఏళ్లు నిండిన యువ‌కుడికి ఓటు హ‌క్కు పొందే అర్హ‌త ఉండ‌దు. దీంతో ఆ ఏడాదిలో వ‌చ్చే ఏ ఎన్నిక‌ల్లో కూడా వారు ఓటు ఆ యువ‌త ఓటు వేసే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో చాలా రోజుల నుంచి చ‌ర్చ న‌డుస్తోంది. అందుకే ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం ఏడాదికి నాలుగు సార్లు ఓటు హ‌క్కు న‌మోదు కార్య‌క్ర‌మం నిర్వహిస్తుంది. దీని వ‌ల్ల ఎక్కువ మంది యువ‌కుల‌కు ఓటు వేసే అవ‌కాశం క‌లుగుతుంది. 

గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పాకిస్తాన్ బోట్‌లో రూ. 400 కోట్ల హెరాయిన్..

స‌ర్వీస్ ఓటు హక్కులోనూ మార్పులు..
ప్ర‌భుత్వ ఉద్యోగుల భాగ‌స్వామి ఓటు హక్కు విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ సంస్క‌ర‌ణ తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్త ఓ ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటే అక్క‌డ భార్య‌కు కూడా స‌ర్వీస్ ఓటు అందించే వారు కానీ భార్య ఉద్యోగం చేస్తుంటే భ‌ర్త‌కు మాత్రం ఓటు హ‌క్కు ఉండ‌క‌పోయేది. అయితే వివ‌క్ష‌ను రూపుమాపేందుకు ఓ మార్పు తీసుకొచ్చారు. భార్య ఉద్యోగం చేస్తున్న చోట‌నే భ‌ర్త‌కు కూడా స‌ర్వీస్ ఓటు క‌ల్పించ‌నున్నారు. ఈ మూడు నిర్ణ‌యాల‌తో పాటు ఎన్నికల స‌మ‌యంలో ఏ భ‌వ‌నాన్ని అయినా ఎన్నిక‌ల సంఘం వాడుకునే అవకాశం రానుంది.